పదవిస్తే పాదయాత్రలు ! ‘రూటు’ మార్చిన లీడర్లు ?

-

ఒకప్పుడు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎన్నికలకు ముందు పాదయాత్ర లు చేపట్టే వారు. ఏ పార్టీ పాదయాత్ర చేపట్టి జనాల్లోకి వెళ్తుందో , ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం పార్టీలోనూ, జనాలలోనూ ఉండడంతో పాదయాత్రలకు డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. ఆ ఫార్ములా వర్కవుట్ కావడంతో, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు సైతం పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చారు.

2019 ఎన్నికలకు ముందు వైసిపి అధినేత జగన్ పాదయాత్ర కు శ్రీకారం చుట్టి ఊహించని రీతిలో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ఏవీ ఇప్పట్లో లేవు. అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర లు చేపడతాము అంటూ పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వీరు పోటీ పడడం లేదు. పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్తామని , ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తా అంటూ హడావుడి చేస్తున్నారు. మొదట తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి , ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తాను అని ప్రకటించారు .

ఇక అదే పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న మరో సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం తాను పాదయాత్ర చేపడతానని, తనకిి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అంటూ హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇక మరో సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తాను పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు వస్తాను అని, తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు పీసీసీ అధ్యక్ష పదవి కోసం పాదయాత్రలు అంటూ హడావుడి చేస్తూ, అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news