మిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి రెబెల్‌గా బరిలోకి దిగుతున్నారు. ఈ పరిణామం ఇప్పుడు టీడీపీ కూటమికి తలనొప్పిగా మారింది.హిందూపురం పార్లమెంటు స్థానం విషయంలో పరిపూర్ణానందస్వామి పట్టు వీడటం లేదు.తనను కాదని హిందూపురం పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థిగా సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారధిని కూటమి అభ్యర్థిగా ప్రకటించడమే దీనికి కారణం.
ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద పోటి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం సాగింది. పరిపూర్ణానంద స్వామీజీ హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పెనుగొండ నియోజకవర్గం కేంద్రంగా గత ఐదు నెలలుగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.అడపాదడపా నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తున్నారు.
బిజెపి అధిష్టానం నుంచి తాను మాట తీసుకొని హిందూపురం పార్లమెంటు వచ్చానని పరిపూర్ణానంద స్వామి చెప్తున్నారు.ఈ నేపథ్యంలోనే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడిన అనంతరం జరిగిన పరిణామాలలో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా తనకు టిక్కెట్ దక్కలేదు.దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్వామీజీ కూటమి తాజా నిర్ణయాలపై సెటైర్లు కూడా పేల్చారు.తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తాను తీసుకున్న నిర్ణయం మేరకు హిందూపురం పార్లమెంటు నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తేల్చడంతో కూటమిలో అలజడి మొదలైంది.
హిందూపురం అసెంబ్లీ అభ్యర్ధిగా కూడా తానే పోటీ చేస్తున్నట్లు స్వామీజీ ప్రకటించారు.ఈ ప్రకటనతో ఒక్కసారిగా హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ నిర్ణయం సంచలనంగా మారింది. తాను బిజెపిలోనే ఉంటాను అంటూనే కూటమిలో రెబల్ అభ్యర్థిగా పార్లమెంట్ స్థానం నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని చెప్పడంతో కూటమి నేతలు ఆందోళనకు గురవుతున్నారు.
శ్రీపీఠం అధిపతి స్వామీజీ పరిపూర్ణానంద చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనగా మారాయి. టిడిపి బిజెపి జనసేన పొత్తు కుదరక ముందు నుంచి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి తాను పోటీ చేస్తానని బిజెపి అధిష్టానానికి పరిపూర్ణ స్వామి స్పష్టం చేశానని..కానీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా టిడిపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ వత్తిడి వల్లే బిజెపిలో పార్లమెంట్ అవకాశం తనకు ఇవ్వకుండా చేశారని ఆవేదన చెందుతున్నారు.పరిపూర్ణానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాను రెబెల్‌గా పోటీ చేయబోతున్నానని చెప్పినా బీజేపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు.
హిందూపురంలో మైనార్టీ ఓట్లు 60 వేలకు పైగా ఉన్నాయి.బిజెపికి పార్లమెంటు సీటు ఇవ్వడం వలన ఈ ఓట్లు టిడిపికి పడవని నందమూరి బాలకృష్ణ భావించారు.తనకు బిజెపి టికెట్ దక్కకపోయినా పోటీ నుంచి విరమించే ప్రసక్తే లేదంటూ చెబుతూనే హిందూపురం పార్లమెంటు నుంచి అలాగే హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయడం ఖాయమని పరిపూర్ణానంద స్వామి కుండబద్దలు కొట్టారు. అయితే పరిపూర్ణానందస్వామి తాజా నిర్ణయంపై కూటమిలోని పార్టీల నేతలు ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారిం