‘కాపు’ ఎఫెక్ట్: జగన్ బాబాయి పోస్టుకు ఎసరు పెట్టిన పవన్…

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అనుహ్యా రీతిలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపే కార్యక్రమం చేస్తున్నారు…అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇలా సడన్‌గా పవన్ ఫైర్ అవ్వడానికి కారణాలు లేకపోలేదని తెలుస్తోంది. ఇంకా రాజకీయంగా బలపడాలంటే దూకుడుగా ఉండాల్సిందే…అందుకే పవన్ దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారని, అందుకే ఇలా తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సరే ఈ విమర్శ, ప్రతి విమర్శలని పక్కనబెడితే….ఏపీ రాజకీయాల్లో పవన్ మాత్రం ఒక కీలక మార్పు తీసుకొచ్చారనే చెప్పొచ్చు. ముఖ్యంగా తన సొంత సామాజికవర్గమైన కాపుల్లో కీలక మార్పు తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో కాపులు జగన్‌కు పెద్ద సంఖ్యలో మద్ధతు ఇచ్చారు. కానీ జగన్‌కు మద్ధతు ఇవ్వడం వల్ల ఒరిగింది ఏమి లేదనే కోణంలో పవన్ రాజకీయం స్టార్ట్ చేశారు.

అలాగే కాపుల వల్ల అందరూ లబ్ది పొందుతున్నారని, కానీ కాపులు మాత్రం లబ్ది పొందడం లేదని, కాపులు, ఒంటరి, తెలగ, బలిజ కులాలు కూడా రాజ్యాధికారం సాధించాలని మాట్లాడారు. రాజమండ్రి పర్యటనకు వెళ్లినప్పుడు పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కాపులకు జరిగిన నష్టాలని చెప్పారు. అయితే ఇక్కడ నుంచే కాపుల్లో మార్పు మొదలైంది. ఇక కాపులంతా ఏకమయ్యే పరిస్తితి వచ్చింది.

అదే సమయంలో రాజమండ్రి పర్యటనకు వచ్చినప్పుడు వైసీపీ ప్రభుత్వం, పోలీసుల చేతే పవన్‌ని అడ్డుకునే ప్రయత్నం చేసింది…దీనిపై కాపులు కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వైసీపీలో ఉన్న కాపు నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అయితే కాపులు పూర్తిగా వైసీపీ వైపు వెళ్లకుండా ఉండాలంటే…ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డిని మార్చాలని అన్నారు.

అయిన కాపు ప్రభావం ఉన్న జిల్లాల్లో రెడ్డి వర్గం నాయకుడి పెత్తనం ఏంటని….గోదావరి జిల్లాల్లో ఉన్న కాపు నేతల్లో అసంతృప్తి ఉందట. ఆయన్ని మార్చి…ఒక కాపు నాయకుడుకు బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట. అలా జరగకపోతే కాపులు ఏకమయ్యి, పవన్ వెంట నడిచే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. మొత్తానికి పవన్….జగన్ బాబాయి సీటుకే ఎసరు పెట్టారు.