పవన్ ‘యాత్ర’..టార్గెట్ ‘సీఎం’!

-

రాజకీయాల్లో పాదయాత్రకు మంచి మైలేజ్ వస్తుందనే చెప్పాలి..పాదయాత్ర చేస్తూ..ప్రజల దగ్గరకు వెళ్ళే ఏ నాయకుడుకైన రాజకీయంగా సక్సెస్ అవ్వాల్సిందే…ఇప్పటివరకు పాదయాత్ర చేసిన వారు పెద్దగా ఫెయిల్ అయిన దాఖలాలు లేవు…వైఎస్సార్, చంద్రబాబు, జగన్..వీరు పాదయాత్ర చేసే ప్రతిపక్షం నుంచి సీఎం సీటు అందుకున్నారు. అయితే ఏపీలో అధికారం దక్కించుకోవడం కోసం మళ్ళీ ప్రతిపక్షాలు పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే టీడీపీని ఇంకా బలోపేతం చేయడానికి నారా  లోకేష్ పాదయాత్ర చేస్తారని ప్రచారం జరుగుతుంది..పాదయాత్ర కాకపోయిన సైకిల్ యాత్ర అయిన చేస్తారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఈ యాత్ర టీడీపీకి మైలేజ్ పెంచుతుందని అంటున్నారు.

టీడీపీ విషయం పక్కన పెడితే…పవన్ కల్యాణ్ జనంలోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఇప్పటివరకు సినిమాలు ఓ వైపు, మరో వైపు రాజకీయం చేస్తూ వస్తున్న పవన్…ఇక మీదట పూర్తి స్థాయిలో రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు…పైగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయడానికి పవన్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే దసరా నుంచి ప్రజల్లో ఉంటానని పవన్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 5 నుంచి పవన్…ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే…జనసేనని బలోపేతం చేసేందుకు పవన్ రెడీ అయ్యారు.

అక్టోబర్ 5 నుంచి పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే పాదయాత్ర లేక బస్సు యాత్ర చేస్తారో ఈ నెల 21న జరిగే పి‌ఏ‌సి సమావేశంలో తేలనుంది. మొత్తానికైతే పవన్ ఇకపై ప్రజల్లో ఎక్కువగా ఉండనున్నారు. ఇలా చేయడం వల్ల జనసేన పార్టీ బలం పెరగొచ్చు…అలాగే పవన్ కు సీఎం అయ్యే అవకశాలు ఇంకా మెరుగు పడవచ్చు.

అయితే పవన్ చేసే దాని బట్టి…టీడీపీ సైతం ఓ యాత్రకు ప్లాన్ చేసుకునే అవకశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు వయసు మీద పడటంతో…లోకేష్ రంగంలోకి దిగవచ్చు. మరి చూడాలి ఈ యాత్రలతో ఎవరికి ఎంత మైలేజ్ వస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news