“మద్యం షాపులు తెరుచుకుంటాం మహాప్రభో … “

-

కరోనా వైరస్ వల్ల ఒక పక్క ఆకలి కేకలు విన్న పడుతుంటే మరోపక్క మందు బాబు ల గోల తారాస్థాయికి చేరుకుంది. కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది మందుబాబులు మద్యం దొరకక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. మరికొన్ని చోట్ల మద్యం దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరొక పక్క కొంతమంది అయితే న్యాయబద్ధంగా సోషల్ మీడియాలో ప్రజలకు నిత్యావసరాలు కోసం కేటాయించిన టైములో మద్యం దుకాణాలు కూడా తెరవాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.Not love for liquor but money, why states want alcohol to flow ...కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా మద్యం దుకాణాలు తెరువ కూడదని చాలా స్ట్రిక్ట్ రూల్స్ రాష్ట్రాలకు జారీ చేయడం జరిగింది. మద్యపానం గుట్కా వీటన్నిటిని ప్రజలకు దొరకకుండా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడంతో అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయాలు మొత్తం పడిపోయాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే కేంద్ర ప్రభుత్వానికి పంజాబ్ రాష్ట్రం మద్యం షాపులు తెలుసుకోవటానికి పరిమిషన్ ఇవ్వండి మహా ప్రభో అంటూ వేడుకుంటుంది.

 

పంజాబ్ రాష్ట్రంలో మద్యానికి అలవాటు పడిన వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మద్యం దొరకకపోవడంతో వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నాయని మద్యం షాపులకు లాక్ డౌన్ నుంచి మిన‌హాయించాల‌ని కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగానే కోరింది. అయితే కేంద్రం మాత్రం అందుకు నో చెప్పింది. మే 3 వ‌ర‌కూ అలాంటి ఆశ‌లేమీ పెట్టుకోవ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసింది. పంజాబ్ రాష్ట్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సమస్య లేదు 3 వరకు ఎటువంటి మద్యం షాపుల ఓపెన్ కాకూడదని కరాఖండిగా చెప్పేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news