సీన్‌లోకి వచ్చిన అచ్చెన్న…సీన్ అర్ధమైనట్లుంది..

ఏపీలో పోలిటికల్ వార్ సీన్ పూర్తిగా మారిపోయింది…అధికార వైసీపీ-జనసేనల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. హఠాత్తుగా పవన్ దూకుడు ప్రదర్శించడంతో ఏపీలో ప్రతిపక్ష పాత్ర మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒక్కసారిగా పవన్‌ని వైసీపీ టార్గెట్ చేసింది. ఆయన టార్గెట్‌గానే రాజకీయం చేస్తుంది. అయితే జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా జరుగుతున్న ఈ పోలిటికల్ వార్‌లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు సైడ్ అయిపోయారు.

తాజాగా నాదెండ్ల మనోహర్ సైతం….ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జనసేన అని మాట్లాడారు. అలాగే జనసేనని చూసి వైసీపీ వణికిపోతుందని అన్నారు. అంటే ఇక్కడ టి‌డి‌పి పూర్తిగా సైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ టి‌డి‌పి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లైన్‌లోకి వచ్చారు. ఇప్పటివరకు పవన్-వైసీపీ మధ్య జరుగుతున్న వార్‌లో టి‌డి‌పి తలదూర్చలేదు. కానీ తాజాగా అచ్చెన్న…సడన్ గా వచ్చి పవన్‌కు సపోర్ట్ గా మాట్లాడుతూ…పోసాని కృష్ణమురళిపై ఫైర్ అయ్యారు.

అసలు పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునే విధంగా లేవా? అచ్చెన్న అని ప్రశ్నించారు. అసభ్యపదజాలంతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్  కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుందని అన్నారు. ఇదంతా చూస్తున్న జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని అడిగారు. అంటే పోసాని చేత ప్రశాంత్ కిషోర్ మాట్లాడించారని చెప్పి అచ్చెన్న సరికొత్త రాజకీయంతో ముందుకొచ్చారు.

అదే సమయంలో పవన్‌కు మద్ధతు పలుకుతూ…ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.  పైగా రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ జనసేన వార్ మారుతుంది కాబట్టి, అచ్చెన్న లైన్‌లోకి వచ్చి తాము కూడా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేసుకున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో టి‌డి‌పి సీన్ అయిపోయిందని అచ్చెన్నకు అర్ధమైనట్లు ఉంది. పవన్‌కైనా సపోర్ట్ చేస్తే కనీసం హైలైట్ అవుతామని అనుకున్నట్లు ఉన్నారు.