ఈటెల రాజేందర్ కు అస్వస్థత.. పాదయాత్రకు బ్రేక్ !

కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో వీణవంక మండలం కొండపాక వరకూ నడిచి మధ్యాహ్న భోజనమే ఈటల రాజేందర్ తన పాదయాత్రను ముగించారు. తీవ్ర జ్వరంతో రావడంతో.. ఈటల రాజేందర్ కు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

దీంతో ఈటల రాజేందర్ కు బదులు ఆయన సతీమణి ఈటల జమున పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బిజేపి నేతలు. ఈటల జమున ఇవ్వాళ్టి నుంచి పాదయాత్ర మొదలు పెడతారా ? లేదా ? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈటల రాజేందర్ జ్వరంతో కాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారని.. జ్వరం తగ్గితే ఇవ్వాళ్టి పాదయాత్ర కొనసాగిస్తున్నారని బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి ప్రకటించారు. కాగా వారం రోజుల క్రింద… మాజీ మంత్రి ఈటల రాజేందర్.. పాదయాత్ర మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక అటు బీజేపీ తో పాటు గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.