పంజాబ్ లోని భవానీగర్ లో రైతుల ర్యాలీలో ప్రసంగిస్తూ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. 2024 లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. అంతే కాకుండా అమరీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ ‘ప్రధాని అయినప్పుడు కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను కచ్చితంగా రద్దు చేయాలని కోరారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం పంజాబ్ లో తన ఖేతి బచావో ర్యాలీలో ఉన్నారని ఆ తర్వాత హర్యానా వెళ్తారని ఆయన వివరించారు. ప్రధాని మోడిని లక్ష్యంగా చేసుకుని… మాట్లాడిన సిఎం… కార్పోరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్రం ఈ వ్యవస్థను మారుస్తోందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి.