ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం ఎవకిరీ అంతుచిక్కట్లేదు. ఆయన జగన్ ప్రభుత్వంపై బాగా కోపంమీద ఉన్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అన్నిరాష్ట్రాల ఎంపీలు, ముఖ్యమంత్రులకు లేఖలు రాసిన రఘురామ.. తనపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు.
ఇప్పటి వరకు ఆయన తనపై జరిగిన దాడి గురించి మాత్రమే మాట్లాడుతూ వస్తున్నారు. ఆయనకు మద్దతుగా చాలామంది ఎంపీలు నిలుస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఎంపీలు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రఘురామ పోలవరంపై పడ్డారు.
ఈ రోజు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన రఘురామ పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి గురించి లేఖ అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రాజెక్టు నిధుల్లో 25శాతం వరకు కమీషన్లు తింటున్నారని ఫిర్యాదు చేశారు. నిరుపేదలకు దక్కాల్సిన పునరావస నిధులను కూడా కాజేస్తున్నారని ఆరోపించారు. అయితే పోలవరంపై ఒకవేళ కేంద్ర ప్రభత్వం జోక్యం చేసుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అదే జరిగితే జగన్ ప్రభుత్వం దానిపై పూర్తి వివరణ ఇచ్చుకోవాల్సిందే.