డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇవాళ 2008 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత నిబంధనల మార్చడం వల్ల తమకు అన్యాయం జరిగిందని 11 ఏళ్ల నుంచి 2,193 మంది అభ్యర్థులు పోరాటం చేస్తున్నారని సిఎం జగన్ కు ఈ సందర్బంగా వివరించారు అభ్యర్థులు. దీనిపై స్పందినంచిన సిఎం జగన్..కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టటానికి అంగీకరించారు. జగన్ తాజా నిర్ణయంతో 2008 డీఎస్సీ అభ్యర్థులకు భారీ ఊరట లభించింది. సిఎం జగన్ తాజా నిర్ణయంపై 2008 డీఎస్సీ అభ్యర్థి వెలుగు జ్యోతి మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మార్చడం వల్ల అన్యాయం అయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని.. అనేక ముఖ్యమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.

పాదయాత్ర సమయంలో మా సమస్యను జగన్ దృష్టికి తీసుకుని వెళ్లామని.. రూ. 21,230 పే-స్కేల్ ను ప్రభుత్వం ఫిక్స్ చేసిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ మాకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగ సంఘం నేత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండేళ్ళు పూర్తి చేసుకోనున్నారని..ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్షలు, ఇతర ప్రక్రియలు పూర్తి చేసి రెగ్యులరైజ్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.