తెలంగాణ నుంచి రాహుల్ పోటీ…!

-

తెలంగాణ నుంచి ఏదో ఒక స్థానం నుంచి పార్లమెంట్ కి పోటీ చేయాలని సోనియాగాంధీని కాంగ్రెస్ నేతలు కోరిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా వినిపించాయి.అయితే ఈ ప్రతిపాదనలు సోనియా గాంధీ సున్నితంగా తిరస్కరించారు.పైగా ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సోనియా ఖమ్మంలో పోటీ చేయాలని గతంలో టీపీసీసీ తీర్మానం చేసింది.కానీ ఆరోగ్యం, వయసు రీత్యా ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో తెలంగాణ నుంచి ఆమె పోటీ చేయడం లేదనేది తేలిపోయింది.అయితే ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారు.అయితే ఈసారి వయనాడ్ స్థానంలో కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయనున్నారు.అందుకే రాహుల్ తెలంగాణకు షిఫ్ట్ కావాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో సంప్రదింపులు కూడా జరిపారని తెలుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా ఆయన రెండు స్థాలను ఎంపిక చేసుకున్నారు. అందులో ఒకటి ఖమ్మం కాగా మరొకటి భువనగిరి.ఈ రెండు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలే. అయితే ఖమ్మం ఇంకా బలమైన సీటు. అక్కడ కాంగ్రెస్ కు ఇప్పుడు సరైన ప్రత్యర్థి లేదు. బీఆర్ఎస్ నుంచి నేతల వలసతో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడింది. ద్వితీయ శ్రేణి క్యాడర్ కూడా పార్టీ మారిపోయింది. బీజేపీ ఉనికి దాదాపుగా లేదు. దీంతో ఖమ్మంలోనే రాహుల్ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు సోనియా, రాహుల్ గాంధీలు యూపీలోని రాయ్ బరేలీ, అమేథీ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో రాహుల్ అమేథీ తో పాటు వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు.యూపీలో ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీతో కాంగ్రెసుకు పొత్తు కుదిరింది. ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే దక్షిణాదిలో పోటీ చేస్తే ఆ ప్రభావంతో ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని పార్ట్ వర్గాలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news