దేశంలో వ్యాక్సిన్ కొరతపై ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే పోస్టర్లకు సంబంధించి 12 మందికి పైగా ఢిల్లీలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. రాహుల్ గాంధీ “నన్ను కూడా అరెస్ట్ చేయండి” అనే క్యాప్షన్ తో ప్రధానిని విమర్శిస్తూ పోస్టర్ ట్వీట్ చేశారు. మీ టూ అరెస్ట్ అంటూ ఆయన ట్వీట్ చేసారు. “మోడీ జీ, మీరు మా పిల్లలకు ఉద్దేశించిన వ్యాక్సిన్లను విదేశాలకు పంపారు” అని క పోస్టర్ లో ఉంది.
ఈ వ్యవహారం దేశ రాజధానిలో సీరియస్ కావడంతో పోలీసులు చర్యలకు దిగారు. అరెస్టయిన వారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు – ఆటో-రిక్షా డ్రైవర్లు లేదా ప్రింటింగ్ ప్రెస్‌లోని వ్యక్తులు ఉన్నారు. కళ్యాణ్‌పురి ప్రాంతం నుంచి అరెస్టయిన నలుగురు రోజువారీ కూలీలు ఉన్నారు. ఈ పోస్టర్లను ఖాజురి, కళ్యాణ్‌పురి, దయాల్‌పూర్, భజన్‌పురా, మంగోల్‌పురి సహా పలు ప్రాంతాల్లో అంటించారు.