ఆకలి మీద రాజకీయం చేస్తావా…? సిగ్గుందా…?

-

గాంధీ ఆసుపత్రి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేసేందుకు వెళుతున్న ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదంకు దిగారు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయి… మిమ్మల్ని అనుమతించలేమన్న పోలీసులు… రేవంత్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లకుండా రౌండప్ చేసారు. రాతపూర్వక ఆదేశాలు చూపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పేదవాడి ఆకలిపై రాజకీయాలు చేస్తారా… సిగ్గుందా అంటూ ఆయన మండిపడ్డారు. లాక్ డౌన్ టైంలో పేదలకు పట్టెడు అన్నం పెట్టడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. నేను స్థానిక ఎంపీని, నన్ను అడ్డుకోమని చెప్పే అధికారం ఎవరిచ్చారు అని నిలదీశారు. గరీబోడి నోటికాడి కూడు లాగేసే ప్రయత్నం ఏమిటి అని మండిపడ్డారు. సామాజిక సేవలోనూ రాజకీయాలు వెతికే ప్రయత్నం దుర్మార్గం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news