రాహుల్ గాంధీకి 53 ఏళ్లు పూర్తి శుభాకాంక్షలతో ముంచెత్తిన నేతలు

-

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి 53 ఏళ్లు నిండాయి.భారత్‌ జోడోయాత్రతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఆయనను విషెస్‌తో ముంచెత్తారు. ప్రధానమంత్రి రేసులో ఉన్నరాహుల్‌ గాంధీపై అటు మిత్రపక్షాలు కూడా ప్రశంసలు కురిపించారు. రాహుల్‌ సారథ్యంలో 2024లో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్తున్న పార్టీ పెద్దలు రాహుల్‌కి దీర్ఘాయుర్థాయం కలగాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్విట్టర్‌లో రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల రాహుల్‌ అచంచలమైన నిబద్ధత,ప్రతికూల పరిస్థితుల్లో ప్రదర్శించిన ధైర్యం ప్రశంసనీయమని కొనియాడారు. ఎప్పుడూ నిజం మాట్లాడటానికి ఇష్టపడే రాహుల్‌ గాంధీ మిలియన్ల మంది భారతీయుల గొంతుగా మారాలని అకాంక్షించారు ఖర్గే.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ట్విట్టర్ ద్వారా రాహుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల రాహుల్‌ అంకితభావం,నిబద్ధత స్ఫూర్తిదాయకమని అన్నారు.రానున్న ఏడాది అపారమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్నిచ్చి పార్టీని మరింత పటిష్టంగా మార్చాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

రాహుల్ గాంధీజీకి శుభాకాంక్షలు తెలిపిన బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోగ్యంగా,దీర్ఘకాలం జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ రాహుల్‌ను ప్రియమైన సోదరుడు అంటూ సంబోధించిన ఆయన భారతదేశ ప్రజాస్వామ్య ధర్మాన్ని కాపాడటానికి కలిసి నడుద్దామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. డిఎంకె ఎంపి కనిమొళి కూడా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అతను ఆరోగ్యకరమైన,సంతోషకరమైన జీవితం పొందాలంటూ మరికొందరు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news