తెలంగాణని వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. తెలంగాణలోని అన్నీ జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి, ఇళ్లని వరద ముంచెత్తుతుంది. వాగులు, వంకలు, నదులు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇక వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలని ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
అయితే అన్నీ పార్టీలు మానవతా దృక్పథంతో ప్రజల కోసం పనిచేస్తున్నాయి. సరే ఇక్కడ వరకు ఎవరిని తప్పుబట్టడానికి లేదు. కానీ ఇది నిదానంగా రాజకీయం వైపు తిరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా ఎన్నికల ముందే ఈ వరద ముంచెత్తింది. అలాంటప్పుడు ప్రతి పార్టీ దీన్ని రాజకీయ కోణంలో వాడుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ అంశం ప్రతి పార్టీకి కీలకమే. మొదట ప్రభుత్వానికి ఇది పెద్ద టాస్క్. వరద వల్ల నష్టపోయిన ప్రజలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇందులో ఏదైనా తప్పు జరిగిందా ప్రతిపక్షాలు రాజకీయంగా ఏకిపారేస్తాయి.
ఎన్నికల సమయం కాబట్టి అధికార బిఆర్‌ఎస్ ఆచి తూచి ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. ప్రజలకు అండగా నిలబడితే..ఆ ప్రజలే మళ్ళీ బిఆర్‌ఎస్‌కు అండగా నిలబడతారు. అలా కాకుండా ఏదైనా తేడా జరిగితే ప్రతిపక్షాలకు బెనిఫిట్ జరుగుతుంది. ముఖ్యంగా దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ఈ అంశంలో అలెర్ట్ గా ఉంది.
ప్రభుత్వాన్ని సాయం గట్టిగానే డిమాండ్ చేస్తుంది. అది జరగకపోతే కేసిఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేసేలా ఉంది.అటు బిజేపి సైతం రెడీగానే ఉంది. ఆ పార్టీ రేసులోకి రావడానికి ఇదొక అవకాశం. కాబట్టి ఈ వరదలో రాజకీయం కూడా వాడివేడిగా సాగేలా ఉంది.