పేదలని పక్కన పెట్టి – పెద్దలకి పట్టం కట్టారెందుకు ?

-

దేశంలో బ్యాంకులు పేదల పట్ల ఒకలాగా పెద్దల పట్ల మరొక లాగా వ్యవహరిస్తున్నాయి. మామూలుగా పేదవాడు రుణం కోసం బ్యాంకు కి వెళ్తే ఆ రూల్స్ ఈ రూల్స్ అంటూ ముప్పు తిప్పలు పెట్టి రుణాలు ఇస్తాయి. పేదవాడు రుణం కట్టడంలో కొద్దిగా ఆలస్యం అయినా అర్థం పర్థం లేని రూల్స్ తెరపైకి తెచ్చి వడ్డీల మీద వడ్డీలు బాదుతుంటాయి.Rs 68,607 cr loans of wilful defaulters, including Choksi written ...సామాన్యుడు చెక్ బౌన్స్ అయిన వెంటనే న్యాయస్థానం అంటూ హడావిడి చేసే బ్యాంకులు తాజాగా పెద్దలకు చెందిన రుణాలను 68 వేల కోట్లను కూరలో కరివేపాకు లాగా రద్దు చేశాయి. దీంతో దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పై విమర్శలు వస్తున్నాయి. దాదాపు ఆర్బిఐ రద్దు చేసిన ఎకౌంట్ లు మొత్తం చూస్తే బడా పారిశ్రామికవేత్తల వే.

 

వాళ్లు చేసిన అప్పులు తిరిగి వసూలు చేయలేమని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెల్లారితే కోట్ల రూపాయల కారులో తిరుగుతూ ఉండేవారికి ఈ విధంగా బ్యాంకులు సహకరించడం పట్ల సామాన్యులు మండిపడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూడు నెలల EMI లు సామాన్యుడు కట్టుకోలేను మొర్రో అంటే ఒకే అని చెప్పి ఆ మూడు నెలల వాయిదా మొత్తాన్ని ప్రిన్సిపాల్ అమౌంట్ కి కలిపేసి వాసులు చేయాలనీ సూచించిన ఆర్బీఐ పేదల ని పక్కన పెట్టి, పెద్దలకి ఈ విధంగా సహకరించడం అమానుషమని దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news