కేసీఆర్ రూట్లోనే వెళ్తున్న రేవంత్.. వ్యూహం ఫలిస్తుందా..?

-

కేసీఆర్ వ్యూహం పన్నితే ఎంతటి ప్రత్యర్థులు అయినా సరే దానికి జవాబు ఇవ్వాల్సిందే. ఆయన ఏది చేసినా కూడా అందులో తన మార్కు చూపించుకుంటారు. తనను తాను పెద్ద లీడర్ గా మార్చుకోవడంలో ఎంతో పక్కాగా వ్యూహాలు అమలు చేశారు. ఆయన ఏదైనా విమర్శ చేస్తే అది చిన్న నేతలను టార్గెట్ చేసినట్టు ఉండకుండా కేవలం పెద్ద లీడర్లపై చేసి రాజకీయ వర్గాలు దానిమీద చర్చ సాగించేలా ఆయన ప్లాన్ వేసేవారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఆయన ఇలాంటి రాజకీయాలతోనే ముందుకు వెళ్లారు. అందుకే ఆయన పెద్ద లీడర్ గా అవతరించారు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి రాజకీయాలనే చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

రేవంత్ టీపీసీసీ చీఫ్‌గా నియామకం జరిగినప్పటి నుంచి నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తానూ పెద్ద లీడర్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలు గానీ లేదంటే ఆరోపణలు గానీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో అసలు రేవంత్‌ను ఎలా డీల్ చేయాలో తెలియక టీఆర్ఎస్ ఆవేశ పూరితంలో చేస్తున్న తప్పిదాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోంది.

ఇక రీసెంట్ గా డ్రగ్స్ టెస్టు విషయంలో కూడా రేవంత్ కేటీఆర్‌కు విసిరిన సవాల్‌తో అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన కామెంట్స్, తో పాటు కేటీఆర్ చాలెంజ్ స్వీకరించకుండా రాహుల్ గాంధీని ఇందులోకి లాగడంతో కేటీఆర్ భయపడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరోవైపు నిన్న రేవంత్ రెడ్డి ఇంటి మీదకు టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లడంతో టీఆర్ఎస్ నేతలు భయపడే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇకపోతే గతంలో కేసీఆర్ చంద్రబాబు లాంటి పెద్ద లీడర్లను విమర్శించి చర్చనీయాంశంగా మారారు. ఇక ఇప్పుడు రేవంత్ కూడా సీఎం కేసీఆర్ ను మొదలుకుని మంత్రుల వరకు అందరినీ టార్గెట్ చేస్తూ పెద్ద లీడర్ అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news