బిగ్ షాకింగ్ న్యూస్ : కేంద్ర మంత్రిగా రేవంత్ రెడ్డి ?

-

దేశంలో రోజురోజుకీ బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో దారుణంగా బిజెపి పార్టీ ఓటమి పాలయింది. దీంతో బీజేపీ హైకమాండ్ వెంటనే అలర్ట్ అయింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షులు మార్చడానికి బిజెపి పార్టీ పెద్దలు కసరత్తు చేస్తోంది. Image result for revanth reddy

కాగా తెలంగాణలో ఎప్పటి నుండో బిజెపి పార్టీలోకి రేవంత్ రెడ్డి ని తీసుకురావాలని చూస్తున్న బీజేపీ పార్టీ పెద్దలు తాజాగా ఆయనకి కేంద్ర మంత్రి ఆఫర్ తో పాటు తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్ష ఇవ్వడానికి రెడీ అయినట్లు ఈ మేరకు ఆయనతో చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా బిజెపి పార్టీ ఇచ్చిన ఆఫర్ కు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం.

 

కనుక బీజేపీ లో చేరితే ఆయనకు రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవి కూడా ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధంగా ఉందట. ఇదే తరుణంలో తెలంగాణలో బలమైన నాయకుడిగా పేరొందిన తుమ్మల నాగేశ్వరరావు ని కూడా బిజెపి పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news