తెలంగాణ సమాజాన్ని అవమానపరిచేలా మాట్లాడిన ప్రధాని మోదీని కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ సభ్యులు నిరసనల్లో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించాడు. కేవలం ఉద్యమ ద్రోహులు మాత్రమే రెబన్ కళ్లద్దాలు పెట్టుకుని, బుల్లెట్ బండ్లపై నిరసన తెలియజేస్తున్నారంటూ.. విమర్శించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు, దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిచ్చిన తర్వాతే సోయి పడి టీఆర్ఎస్ వాళ్లు తూతూ మంత్రంగా నిరసనలు తెలియజేస్తున్నారంటూ.. ఎద్దేవా చేశారు.
తాజాగా కేసీఆర్ జనగామ పర్యటన, ప్రసంగంపై సంచలన ట్విట్ చేశాడు రేవంత్ రెడ్డి. ‘‘తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోదీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు!? అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారు… జనగాం ప్రసంగం తర్వాత ‘కేసీఆర్ ఖేల్ ఖతం’ అన్న విషయం అర్థమైంది.’’ అంటూ ట్విట్ చేశాడు.