బ్రేకింగ్: గద్దర్ తో రేవంత్ రెడ్డి భేటీ

ప్రజా గాయకుడు గద్దర్ ను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నేడు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసినప్పుడు మొదట గద్దర్ ని కలిశానని గుర్తు చేశారు. ఇప్పుడు గేటర్ ఎన్నికలలో మేయర్ ను మాకు ఇవ్వాలని లేదంటే ప్రతిపక్షంగా పాతిక ముప్పై సీట్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గ్రేటర్ ప్రజల్ని కోరారు.

ప్రతిపక్షం బలంగా ఉంటే సమస్యలపైన పోరాడి సమస్యల పరిష్కారం చేస్తామని ఆయన స్పష్టం చేసారు. నేను ఎంపీగా ఉన్నా అని… నాకు తోడుగా 20 30 మంది కార్పొరేటర్ల నిస్తే సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాస్త దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ కి అవకాశాలు తక్కువగా ఉన్నాయి.