రేవంత్ క్లారిటీ..తగ్గని వెంకన్న..తమ్ముడు బాటలోనే?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళే సంఖ్య ఆగేలా లేదు..బలమైన నేతగా ఉన్న రాజగోపాల్ వెనుకే…అంతకంటే బలమైన నేత..రాజగోపాల్ అన్న..కరుడుకట్టిన కాంగ్రెస్ వాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బీజేపీలోకి వెళ్లిపోయేలా ఉన్నారని కథనాలు వస్తున్నాయి. ఓ వైపు పార్టీకి ద్రోహం చేసి వెళ్లారని రేవంత్….రాజగోపాల్ పై ఫైర్ అవుతుంటే…మరో వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి…రేవంత్ పై ఫైర్ అవుతున్నారు.

తన తమ్ముడుతో పాటు తనపై రేవంత్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఎప్పుడు ఎవరిపైన అయిన విమర్శలు చేస్తే పెద్దగా వివరణ ఇవ్వని రేవంత్…ఇప్పుడు వెంకన్నపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను కేవలం రాజగోపాల్ రెడ్డిపైనే విమర్శలు చేశానని, వెంకటరెడ్డి తమ కుటుంబ సభ్యుడు అని, రాజగోపాల్ వేరు…వెంకటరెడ్డి వేరు అని మాట్లాడారు. అలాగే మునుగోడులో కాంగ్రెస్ ని గెలిపించడం కోసం వెంకన్న పనిచేస్తారని చెప్పుకొచ్చారు.

సరే అంతా బాగానే ఉందనుకునే లోపు…వెంకటరెడ్డి మరోసారి రేవంత్ పై ఫైర్ అయ్యారు. తాజాగా ఇంటిగుట్టు పార్టీ…కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. చెరుకు సుధాకర్ కాంగ్రెస్ లో చేరారు. అయితే తన ఓటమి కోసం పనిచేసిన సుధాకర్ ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై వెంకన్న..రేవంత్ పై ఫైర్ అయ్యారు. ఇంకా తాను రేవంత్ మొహం చూడనని మాట్లాడారు.

ఇదిలా ఉంటే తాజాగా వెంకటరెడ్డి…కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వనున్నారు..వరద సాయం గురించి మాట్లాడటానికి అని కథనాలు వస్తున్నాయి…కానీ ఆయన ఇప్పటికే పలుమార్లు బీజేపీ పెద్దలతో భేటీ అవుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. అలాగే వెంకటరెడ్డి సైతం తమ మనిషే అని చెబుతున్నారు…ఇలాంటి సందర్భంలో వెంకన్న…అమిత్ షాతో భేటీ అవ్వడంపై అందరి దృష్టి ఉంది.

ఇక ఆయన కూడా సడన్ గా కాంగ్రెస్ ని వదిలి బీజేపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది. కానీ ఆయన ఏమో కాంగ్రెస్ ని వదలనని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద సంచలనం అవుతున్నారు.