లోకేష్‌కు రేవంత్ సలహా…వర్కౌట్ అవుతుందా?

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి (revanth reddy) దూకుడుగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేస్తూ, అధికార టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతూ, బీజేపీపై విమర్శలు చేస్తున్న రేవంత్…ఎలాగైనా నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాను అనుకున్న విధంగా ముందుకెళుతున్నారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్లని కలుస్తూ, అసంతృప్తి నాయకులని బుజ్జగిస్తూ తన లైన్‌లోకి తెచ్చుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి/ revanth reddy
రేవంత్ రెడ్డి/ revanth reddy

ఇక ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులకు మీడియా సపోర్ట్ ఉంటే త్వరగా బలపడటానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే రేవంత్ కూడా తాజాగా ఏ‌బి‌ఎన్, టి‌వి5 మీడియా అధిపతులని కలిశారు. ఇక ఈ రెండు మీడియాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయనే సంగతి అందరికీ విషయం తెలిసిందే. అలా టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలని రేవంత్ కలిశారు.

ఇదే సమయంలో ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే రాధాకృష్ణ, రేవంత్‌లు పర్సనల్‌గా మాట్లాడుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ సందర్భంలో తాను లోకేశ్‌ కోసం ఎంతో తిరిగానని రాధాకృష్ణ చెప్పగా,  అతన్ని క్షేత్రస్థాయిలో గట్టిగా తిప్పమని రేవంత్‌రెడ్డి సలహా ఇచ్చారు. తెలంగాణలో మీడియా అంతా కేసీఆర్‌ కంట్రోల్‌లో ఉందని.. ఏపీ మీడియాలో మాత్రం ఏబీఎన్, టీవీ5 చానల్స్‌ ద్వారా లోకేశ్‌కు బాగా ప్రచారం కల్పిస్తున్నామని రాధాకృష్ణ చెప్పుకొచ్చినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది.

అయితే ఈ వీడియోలో వారు మాట్లాడుకున్న మాటల ఎంతవరకు వాస్తవమో తెలియదుగానీ, లోకేష్‌ నాయకుడుగా ఎదగాలని రేవంత్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. లోకేష్ ప్రజల్లో తిరిగితేనే ఏపీలో టీడీపీకి ప్లస్ అవుతుందనే విధంగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ మాటలు ఎంతవరకు నిజమో రేవంత్‌కే తెలియాలి. అయినా రేవంత్ సలహా పాటిస్తే లోకేష్‌కే ప్లస్ అవుతుందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news