2019 ఎన్నికల ముందు ఏపీలో రాజకీయంగా అన్నిరకాలుగా జగన్‌కు కలిసొచ్చాయి..టిడిపిపై వ్యతిరేకత ఇంకా ప్లస్ అయింది. అదే సమయంలో కొన్ని న్యూట్రల్ వర్గాలు జగన్‌కు మద్ధతు తెలిపాయి. అదేవిధంగా రాజకీయాల్లో మేధావులు చెప్పుకునే కొందరు జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. అటు తెలంగాణ సిఎం కేసిఆర్ సైతం..చంద్రబాబుకు చెక్ పెట్టాలని జగన్‌కు మద్ధతు ఇచ్చారు.
ఇలా అన్నీ రకాలుగా జగన్‌కు ప్లస్ అయింది. అదే సమయంలో కొన్ని సినిమాలు రాజకీయంగా జగన్‌కు కలిసొచ్చాయి. ఒకటి వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో తీసిన యాత్ర సినిమా..రెండో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నేపథ్యంలో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయంగా జగన్‌కు ఎంతో మేలు చేశాయి. యాత్ర సినిమా వైఎస్సార్ గొప్పతనం చాటిచెప్పింది…వైఎస్సార్ మాదిరిగానే జగన్ కూడా ఉంటారని ప్రజలు భావించారు. ఇక రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం..రాజకీయంగా చంద్రబాబుకు భారీ నష్టం చేసింది. ఇది జగన్‌కు ప్లస్ అయింది. ఇలా అన్నీ రకాలుగా 2019 ఎన్నికల ముందు జగన్‌కు పరిస్తితులు కలిసొచ్చాయి.
ఇప్పుడు కూడా అదే తరహాలో రాజకీయం నడుస్తోంది. అటు ఎలాగో కొందరు బిజేపి పెద్దల మద్ధతు జగన్‌కే ఉంది. ఇక కేసిఆర్, అసదుద్దీన్ లాంటి వారి సపోర్ట్ ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో రామ్ గోపాల్ వర్మ జగన్ పై సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. జగన్ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో..వ్యూహం అనే సినిమా తీస్తున్నారు.
ఇక మళ్ళీ గెలిచి సిఎంగా అడుగుపెడతానని బాబు ఛాలెంజ్ చేయడం, అటు వివేకా హత్య లాంటి అంశాలతో వర్మ..శపథం అని రెండో పార్ట్ తీస్తున్నారు. తనకు జగన్ అంటే ఇష్టమని, తన సినిమాలు రాజకీయంగా ప్రభావం చూపాలనే సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యూహం రాజకీయంగా జగన్‌కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.