ప్రజలకు ఆర్టీసీ కార్మికుల లేఖ.. సోషల్ మీడియా లో హలచల్

-

ఆర్టీసీ సమ్మెపై పీట ముడి పడుతోంది. కార్మికులతో చర్చలే లేవంటున్నారు కేసీఆర్.. అందరినీ కలుపుకుని పోరాడతామంటున్నారు కార్మికులు. తమ సమ్మె సంస్థ కోసమే అంటున్నారు. వారు తమ వాదనను సోషల్ మీడియాల్లో బాగానే ప్రచారం చేస్తున్నారు. తాజాగా వారు ప్రజలకు రాసిన లేఖ వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. ఆ లేఖ ఇదీ..

“ప్రియమైన ప్రజలకు.. ఆర్టీసీలో 12 సం. లోపు పాఠశాల కు వెళ్లుటకు ఫ్రీ..10 వ తరగతి వరకు బాలికల కు ఫ్రీ. జర్నలిస్టుల కు తమ జిల్లాలో ఫ్రీ, రాష్ట్రంలో 1/3, వికలాంగులు 50శాతం రాయితీ, స్వతంత్ర సమరయోధులకు ఫ్రీ, వారి వెంట ఒకరికి 50 శాతం రాయితీ, డయాలసిస్ పేషెంటు కు ఇంటి నుండి హాస్పిటల్ కు ఉచిత రవాణా, ఇన్ని సౌకర్యాలు సామాజిక బాధ్యత తో ఇస్తున్న ఆర్టీసీ ని..భావితరాల కోసం పాడుకోవాల్సిన బాధ్యత.. కార్మికులు గా మాకంటే మీకే ఎక్కువగా ఉన్నది.

రవాణా రంగం పాడియావు.. దీనిని పొందడానికి ప్రైవేట్ శక్తులు పొంచి ఉన్నాయి.డీజిల్ ధర 49 రూ. లు ఉన్నప్పుడు చార్జీలు పెరిగాయి, నేడు 74 ఈ వ్యత్యాసం ఎవరు భరించాలి. 2030 నాటికి ఎలక్ట్రిక్ బస్ లు వస్తాయి.. అన్నీ ప్రైవేట్ వే, ఆర్టీసీ క్రమంగా కనుమరుగై పోతుంది. మీకు తెలుసా జిల్లా కలెక్టర్ కన్నా మా రీజనల్ మేనేజర్ జీతం చాలా ఎక్కువ. తెలంగాణ వచ్చిననాటి నుండి 6 వేల కార్మికులు రిటైర్ అయ్యారు, వారిభారమంతా మా మీదనే.. ఖాళీలు భర్తీ కోసం పోరాటం చేయండి.. 6 వేల ఉద్యోగాలు వస్తాయి.

కడుపు మండిన కార్మికులు సమ్మె చేస్తే.. యాజమాన్యం ఆశ పెట్టిన ఎంగిలి కూడుకు ఆశపడి వారి సమ్మెను విచ్చిన్నం చేయడం ఎలా న్యాయం. మరొక్కమారు మీకు చేతులుజోడించి అడుగుతున్నా ము ..మా న్యాయమైన సమస్యలు పరిష్కరించ బడుటకు సహాయం చేయండి. అంటూ ఈ సందేశాన్ని సోషల్ మీడియాలో వ్యాపింప జేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news