టీడీపీకి మ‌రో షాక్‌.. యామిని సాధినేని గుడ్ బై..!

1454

పార్టీ చ‌రిత్ర‌లోనే ఎప్పుడూ లేనంత ఘోర‌మైన ఓట‌మి మూటగట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తెలంగాణ‌లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా అన్ని జిల్లాకుల చెందిన 200 మంది కీల‌క నేత‌లు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశంకు ఆదివార‌మే ఆఖ‌రు రోజు అన్న ప్ర‌చారం కూడా సోష‌ల్ మీడియాలో న‌డుస్తోంది. తెలంగాణ‌లోనే కాకుండా ఏపీలోనే చాలా ఘోర‌మైన ప‌రిస్థితుల‌ను టీడీపీ ఎదుర్కొంటోంది.

sadineni yamini may quit tdp and joins bjp soon
sadineni yamini may quit tdp and joins bjp soon

ఏపీలో ఇప్ప‌టికే ముగ్గురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌నీసం 10 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. ఈ వ‌రుస షాకుల ప‌రంప‌ర‌లో ఇప్పుడు మ‌రో వాయిస్ ఉన్న మ‌హిళా నేత కూడా టీడీపీ షాక్ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేత ఎవ‌రో కాదు ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ త‌ర‌పున మీడియాలో నానా హంగామా చేసిన యామాని సాధినేని.

యామిని కూడా టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను యామిని కలిసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బీజేపీలో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఎన్నిక‌ల‌కు ముందు ఎన్నిక‌ల టైంలో యామిని టీడీపీ త‌ర‌పున విస్తృతంగా ప్ర‌చారం చేశారు.

sadineni yamini may quit tdp and joins bjp soon
sadineni yamini may quit tdp and joins bjp soon

పార్టీ అధికార ప్ర‌తినిధి హోదాలో మీడియా చ‌ర్చ‌ల్లో బ‌లంగా వాయిస్ వినిపంచేవారు. ఇక ఎన్నిక‌ల టైంలో యామిని సోషల్‌ మీడియాలో టీడీపీ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులను తగ్గిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆమె చేసిన పోస్టులు వివాదాలకు నెల‌వుగా మారాయి.

ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌తో ఆమె జ‌న‌సేన పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు బాగా టార్గెట్ అయ్యారు. ఇటు వైసీపీ వాళ్లు కూడా ఆమెను బాగా ట్రోల్ చేసేవారు. ఇక ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మితో ఇప్పుడు ఆమె బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.