ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం -విద్యాశాఖ మంత్రి

-

అమ‌రావ‌తి : ఆగ‌ష్టు 16న ఏపీలోని అన్ని పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ అన్నారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌ష్టు 16లోగా 100శాతం బూస్ట‌ర్ డోస్ తో పాటు పూర్తిచేయాల‌ని సిఎం ఆదేశించారని తెలిపారు. విద్యాకానుక రెండ‌వ సారి అన్ని స్కూళ్ళ‌లో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. నోటుబుక్కులు, టెస్టుబుక్ లు, బెల్టులు 100శాతం, స్కూలు బ్యాగులు 80శాతం, యూనిఫాంలు 80శాతం, డిక్షన‌రీలు 20శాతం అందుబాటులో ఉన్నాయన్నారు.

 

ఈ సంవ‌త్స‌రం అదనంగా డిక్షన‌రీలు అందించాల‌ని నిర్ణ‌యించామనీ పేర్కొన్నారు. నాడు నేడు లో భాగంగా జ‌రుగుతున్న ప‌నులు 90 నుండి 98శాతం పూర్త‌య్యాయని.. 16న వీటిని రాష్ట్ర‌ ప్రజ‌ల‌కు అంకితం చేస్తున్నామనీ చెప్పారు. అదే రోజు నాడునేడు ఫేజ్ 2 నాలుగు వేల కోట్ల‌తో 16000 స్కూళ్ళ‌కు రూపురేఖ‌లు మార్చేలా కార్య‌క్ర‌మం ప్రారంభిస్తామన్నారు.

విద్యార్ధుల‌కు లైన్ ఎస్సెస్ మెంట్ కింద ఉపాధ్య‌యుల‌ను ఇంటికి పంపి ప్రిపేర్డ్ నేస్ కు ఏర్పాట్లు చేయాల‌ని చెప్పామని.. అమ్మ‌ఒడి వ‌ద్ద‌న్న 9 ల‌క్ష‌ల మందికి వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుండి ల్యాప్ ట్యాప్ లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఆగ‌ష్టు 16 నుండి కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ స్కూళ్ళు ప్రారంభిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news