సిట్టింగ్‌కు సీటు.. ఆ ఎమ్మెల్యే తప్పుకున్నట్లే..!

-

2024 ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమికి..అలాగే గత మూడేళ్లుగా తమని ఇబ్బంది పెడుతున్న వైసీపీకి ఎలాగైనా చెక్ పెట్టాలంటే.. ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో చంద్రబాబు పనిచేస్తున్నారు. గతానికి భిన్నంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని ఖరారు చేసే పనిలో ఉన్నారు. అలాగే మొహమాటం లేకుండా పనిచేయకపోతే సీటు ఇవ్వనని తేల్చి చెప్పేస్తున్నారు.

అలాగే ఇటీవల వరుసపెట్టి టీడీపీ ఇంచార్జ్‌లతో ముఖాముఖిగా భేటీ అయ్యి..నియోజకవర్గాల్లోని పరిస్తితులని తెలుసుకుంటూ..ఇంకా ఎలా పనిచేయాలనే దానిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు 59 నియోజకవర్గాల నేతలతో సమావేశం అయ్యారు. అలాగే సరిగ్గా పనిచేయని నేతలకు గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు..పనిచేసే నేతలకు ఇంకా బాగా పనిచేయాలని చెబుతున్నారు. కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఇంచార్జ్‌లకు సీట్లు ఫిక్స్ చేయలేదు. కాకపోతే కొందరు నేతలు మాత్రం తమకు చంద్రబాబు సీటు ఫిక్స్ చేసేశారని ప్రచారం చేసుకుంటున్నారు.

దీని వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది.. ఉదాహరణకు ప్రొద్దుటూరు సీటు తనకే ఫిక్స్ చేశారని ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ర్యాలీ కూడా తీశారు. కానీ సీటు ఇవ్వలేదని అదే నియోజకవర్గానికి చెందిన కడప పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి చెప్పుకొచ్చారు. పైగా ఈ సీటు కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఇటు గుంటూరు ఈస్ట్ సీట్ నజీర్‌కు ఫిక్స్ చేశారని కథనాలు వచ్చాయి. ఇందులో కూడా వాస్తవం లేదని తెలిసింది.

కేవలం సిట్టింగులకే సీటు ఫిక్స్ చేశారని, ఇంచార్జ్‌లకు సీటు కేటాయించలేదని టీడీపీ ఆఫీసు నుంచి ప్రకటన వచ్చింది. ఇదిలా ఉంటే సిట్టింగులకు సీటు అన్నారు..కానీ అందులో కొందరు సిట్టింగులకు సీటు అనేది డౌట్ గా ఉంది. గంటా శ్రీనివాసరావుకు మళ్ళీ సీటు ఇస్తారో లేదో చెప్పలేం. ఇదే క్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఆమె భర్త ఆదిరెడ్డి వాసు..సిటీలో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సిట్టింగ్ సీటులో మాత్రం మార్పు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news