సంచలనం: టీడీపీలోకి కరణం..కొత్త సీటుపై కన్ను? 

-

గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక దశాబ్దాల పాటు టీడీపీలో పనిచేసిన కరణం బలరామ్ సైతం వైసీపీ వైపుకు వెళ్ళడం టీడీపీ శ్రేణులని షాకుకు గురి చేసింది. అయితే వైసీపీలో చేరాక వ్యాపారాల పరంగా కరణంకు ఎలాంటి ఇబ్బందులు రాలేదనేది వాస్తవం. కానీ రాజకీయ పరంగా ఆయనకు గాని, ఆయన తనయుడు వెంకటేష్‌కు పెద్దగా క్లారిటీ లేదు.

పైగా వీరు వైసీపీలోకి వెళ్లారు గాని..మనసు మాత్రం టీడీపీతోనే ఉందనే విధంగా పరిస్తితి కనిపించింది. వైసీపీలోకి వెళ్ళిన చంద్రబాబుపై ఒక్క విమర్శ చేయలేదు. ఇటీవలే కరణం వెంకటేష్..ఏదో మొక్కుబడిగా బాబు, లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఎంత చేసిన వైసీపీలో వీరికి సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు. తమ సిట్టింగ్ స్థానమైన చీరాల మళ్ళీ కరణం ఫ్యామిలీకి దక్కడం కష్టమనే పరిస్తితి. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కాచుకుని కూర్చుకున్నారు. అటు పోతుల సునీత కూడా ఉన్నారు.

సరే తమ సొంత సీటు అయిన అద్దంకికు వెళ్లడానికి..అక్కడ వైసీపీలో బాచిన చైతన్య కృష్ణ ఉన్నారు. ఆయనకు జగన్ సీటు ఫిక్స్ చేసేశారు. దీంతో కరణం ఫ్యామిలీకి వైసీపీలో సీటు దక్కేలా కనిపించడం లేదు. ఇదే క్రమంలో కరణం ఫ్యామిలీ మళ్ళీ టీడీపీ వైపుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అలాగే కరణం వెంకటేష్ దర్శి సీటుపై కన్నేశారని తెలిసింది.

అక్కడ ఇప్పుడు టీడీపీకి నాయకులు లేరు. శిద్ధా రాఘవరావు, కదిరి బాబూరావు 2019 ఎన్నికల తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు. మొన్నటివరకు ఇంచార్జ్ గా ఉన్న పమిడి రమేశ్ సైతం సైడ్ అయ్యారు. దీంతో ఆ సీటుపై కరణం ఫోకస్ చేశారని తెలిసింది. పైగా ఇక్కడ టీడీపీకి బలం ఉంది..దర్శి మున్సిపాలిటీని సైతం టీడీపీ గెలుచుకుంది. ఈ సీటులో పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చు అనేది వెంకటేష్ ప్లాన్‌గా ఉందని సమాచారం..అందుకే టీడీపీలోకి రావడానికి చూస్తున్నారని తెలిసింది. మరి చూడాలి కరణం ఫ్యామిలీ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news