గత రెండు నెలలకు పైగా నే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని అమరావతి ప్రాంత రైతులు తీవ్ర స్థాయిలో విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ అధ్యక్షులు, నాయకులు రాజధాని ప్రాంతంలో దీక్షలు, ధర్నాలు, నిరసన జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు.
ఇదే సమయంలో మరోపక్క జగన్ తన పంతం నెగ్గించుకోవడానికి మూడు రాజధానులు ఏపీ లో పెట్టడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డు వచ్చినా శాసనసభను రద్దు చేసి ఆ బిల్లును కేంద్రానికి పంపడం జరిగింది. ఇటువంటి సమయంలో ఎవరు ఊహించని విధంగా ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులు కూడా కలలో కూడా ఊహించని వ్యక్తి అమరావతికి వస్తున్నట్లు వార్తలు రావడంతో ఏపీ మీడియాలో ఇది కనివిని ఎరుగని వైరల్ న్యూస్ అయ్యింది.
విషయంలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అమరావతి పర్యటన చేపట్టడానికి రెడీ అయినట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో అమరావతి రైతులు చేస్తున్న దీక్షలో ఒకరోజు పాల్గొనాలని రాహుల్ గాంధీ షెడ్యూల్ తయారు చేసుకున్నారట. దీంతో త్వరలోనే దీనికి సంబంధించి వివరాలన్నీ ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం.