సంచ‌ల‌నం రేపుతున్న స‌ర్వేలు.. కాంగ్రెస్ కు గ‌త వైభ‌వం రాదా..

2014కు ముందర కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ మన రాష్ట్రంలోనూ అధికారంలో ఉంది. కానీ, 2014లో మోడీ ప్రభంజనం స్టార్ట్ అయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఒకరకంగా గల్లంతు అయిందనే చెప్పొచ్చు. బీజేపీ క్రమంగా రాష్ట్రాల్లో విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పట్టు నిలుపుకునేందుకుగాను ప్రయత్నిస్తోంది. కాగా, పూర్వ వైభవం కోసమై కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇకపోతే వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి మరి.. అయితే, తాజాగా ఏబీపీ ప్లస్ సీ ఓటర్ సంస్థలు ‘మూడ్ ఆఫ్ ది పీపుల్’ పేరుతో సర్వే నిర్వహించాయి.

ఆ సర్వేలో ఏం తేలిందంటే.. వచ్చ ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో కమలం పార్టీనే అధికారంలో ఉంది. అయితే సర్వే రిపోర్ట్స్ ప్రకారం దేశంలో మోడీపై, యూపీలో యోగిపై వ్యతిరేకత పెరుగుతోంది. కానీ, అలా అని చెప్పి కాంగ్రెస్ వైపుగా పవనాలు అయితే వీయడం లేదు. దీంతో మళ్ల బీజేపీకే పట్టం కట్టే చాన్సెస్ ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇక పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నిలుపుకోవడం కష్టమేనని అనిపిస్తోంది.

ఈ ఐదు రాష్ట్రాల్లో కనుక బీజేపీనే మళ్లీ సత్తా చాటితే 2024లో మోడీ, బీజేపీని ఎదుర్కోవడం అసాధ్యమనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నది. 2014లో నరేంద్రమోడీని ఢీ కొట్టేందుకుగాను 19 ప్రతిపక్షాలతో ‘జాయింట్ కో ఆర్డినేషన్ కమిటీ(జేసీసీ)’ ప్రయత్నించొచ్చు. ఈ కమిటీలో ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వంటి పార్టీలున్నాయి. వీటితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు కూడా యాడ్ అయితే మోడీ ప్రభంజనం ఎదుర్కోవచ్చనేది పలువురి అంచనా. అయితే, ఈ జేసీసీకి నేతృత్వం వహించాల్సిన పరిస్థితిలో ఉండాలన్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి..