శేరిలింగంపల్లిలో అరికెపూడికి చెక్ పెట్టే వారున్నారా??

-

తెలంగాణా లో రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఎదురుచూస్తోంది. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపానని బిఆర్ఎస్ ఈసారి ప్రజల ముందుకు వెళుతుంది. కానీ బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం 10 ఏళ్ళు వెనకకుపోయిందని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే లా ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపి ప్రజల ముందుకు వెళుతున్నారు.బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈసారి కచ్చితంగా బిఆర్ఎస్ ను ఓడించి తీరుతామని కాంగ్రెస్ బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద నియోజకవర్గాలలో శేరిలింగంపల్లి ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ గౌడ్ పోటీ చేస్తుంటే, బిజెపి తరఫున రవికుమార్ యాదవ్ నిలబడుతున్నారు. ఈ నియోజకవర్గంలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్యే అని తెలుస్తోంది. బిజెపి మూడో స్థానానికి పరిమితమైనట్లు సర్వేలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అరికెపూడి గాంధీకి నియోజకవర్గం లో వ్యక్తిగతంగా మంచి పట్టు ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాలు అందని వారు తప్ప మిగిలిన వారందరూ బిఆర్ఎస్ వైపే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సెటిలర్స్ ఓట్లు కూడా బిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలలోకి వెళుతున్న కాంగ్రెస్ కూడా బిఆర్ఎస్ కు పోటీ ఇస్తోందని చెప్పవచ్చు. మార్పు కోరుకునేవారు కాంగ్రెస్ కు ఓటు వేస్తారంటూ, బిఆర్ఎస్ అవినీతిని అక్రమాలను తొలగించాలంటే కాంగ్రెస్ ఒకటే మార్గం అంటూ జగదీశ్వర్ గౌడ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

మరి బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే…

Read more RELATED
Recommended to you

Latest news