షకీల్‌కు అసదుద్దీన్ షాక్..బోధన్‌లో హ్యాట్రిక్ లేనట్లేనా?

-

ఇంతకాలం బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎం‌ఐ‌ఎం సహకారం అందిస్తూ వచ్చింది. ప్రతి అంశంలోనూ మద్ధతుగా ఉంటూ వస్తుంది. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు సహకరించింది. పాతబస్తీలోని 7 సీట్లలోనే ఎం‌ఐ‌ఎం పోటీ చేసి గెలిచేది. ఆ సీట్లలో బి‌ఆర్‌ఎస్ నామ మాత్రంగానే పోటీ చేసేది. ఇక మిగిలిన సీట్లలో ముస్లిం ఓట్లు బి‌ఆర్‌ఎస్ కు పడేల ఎం‌ఐ‌ఎం పనిచేసేది. అందుకే గత రెండు ఎన్నికల్లో ముస్లిం ప్రభావిత స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచేది.

కానీ ఈ సారి అలాంటి పరిస్తితి ఉండదని…తమకు పట్టున్న ప్రతి స్థానంలోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఇటీవల బోధన్ లో బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్..ఎం‌ఐ‌ఎం పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని…గత ఎన్నికల్లో షకీల్ గెలుపు కోసం ఎం‌ఐ‌ఎం పనిచేసిందని..ఈ సారి ఎన్నికల్లో షకీల్‌ని ఓడించడమే తమ లక్ష్యమని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.

వాస్తవానికి బోధన్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో అక్కడ ఎం‌ఐ‌ఎం పోటీ చేయకుండా బి‌ఆర్‌ఎస్ కు సపోర్ట్ ఇస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ నుంచి షకీల్ గెలిచారు. ఈ సారి మాత్రం బోధన్ లో ఎం‌ఐ‌ఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ అంటున్నారు. అదే జరిగితే ఓట్లు చీలిపోయి బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.

వాస్తవానికి బోధన్ కాంగ్రెస్ కంచుకోట..ఇక్కడ ఆరు సార్లు ఆ పార్టీ గెలిచింది. నాలుగుసార్లు టి‌డి‌పి గెలిచింది. పి. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి మూడుసార్లు గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఆయన వరుసగా ఓడిపోతున్నారు. ఓడిపోతున్న సానుభూతి ఆయనపై ఉంది. ఇప్పటికే షకీల్ అనేక వివాదాల్లో ఉన్నారు..ఆయనపై వ్యతిరేకత ఉంది. ఇక ఎం‌ఐ‌ఎం కూడా బరిలో ఉంటే షకీల్ హ్యాట్రిక్ ఛాన్స్ లేనట్లే.

Read more RELATED
Recommended to you

Latest news