కాంగ్రెస్‌లో మళ్ళీ మొదలైన రచ్చ..గెలిచే సీటులోనే..!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుప్పుడే రేసులోకి వచ్చి దూసుకెళుతుంది..ఆ పార్టీలోకి వలసలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తే..కాంగ్రెస్ గెలుపు సాధ్యమే. కానీ అలా జరిగేలా లేదు. మళ్ళీ నేతల మధ్య అంతర్గత పోరు నడిచేలా ఉంది. ఇప్పటికే పార్టీలో అంతా బాగుందనుకుంటే ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం మొదలైంది. ఇదంతా చేయిస్తుంది రేవంత్ వర్గం అని ఉత్తమ్ భావిస్తున్నారు.

అలాగే పార్టీలో చేరికల విషయంలో తనతో చర్చించలేదని అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లారు గాని..రేవంత్ తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ఈ రచ్చ ఓ వైపు ఉంటే…అదే సమయంల్ సూర్యాపేటలో ఇద్దరు నేతల మధ్య జరిగిన గొడవ సంచలనంగా మారింది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల మధ్య వర్గ పోరు నడుస్తుంది. మామూలుగా సూర్యాపేట కాంగ్రెస్ కంచుకోట..గతంలో దామోదర్ రెడ్డి సత్తా చాటారు. గత రెండు ఎన్నికల్లో అక్కడ బి‌ఆర్‌ఎస్ నుంచి జగదీశ్ రెడ్డి గెలుస్తున్నారు..ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు అంత అనుకూల వాతావరణం లేదు.

కానీ కాంగ్రెస్ లో పోరు జగదీశ్ రెడ్డికి కలిసోచ్చేలా ఉంది. సూర్యాపేట సీటు కోసం దామోదర్ రెడ్డి, రమేశ్ రెడ్డి పోటీ పడుతున్నారు. తాజాగా భట్టి విక్రమార్క పాదయాత్ర సూర్యాపేటలో ప్రవేశించగా, ఆయనకు స్వాగతం పలికేందుకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అక్కడే గొడవ పడ్డారు.

దీంతో ఈ రచ్చ మరింత పెరిగింది. అయితే సీటు కోసం ఇద్దరు నేతలు ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటుంది. కానీ సీటుపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సీటు ఒకరికి ఇస్తే మరొకరు సహకరించరు దాని వల్ల పార్టీకి నష్టం. ఇద్దరు కలిసి పనిచేస్తేనే సూర్యాపేటలో గెలుస్తారు..లేదంటే మళ్ళీ కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news