షర్మిలమ్మ ఆ స్టెప్ వేయడమే కరెక్ట్ కాదా?

ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా టి‌డి‌పి అనుకూల మీడియా ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. ప్రతి విషయాన్ని బూతద్ధంలో పెట్టి చూపిస్తూ…జగన్‌ని ఎక్కడకక్కడ బద్నామ్ చేయడానికి చూస్తుంది. అసలు ప్రతిరోజూ…ఆ మీడియా జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు వేస్తూనే ఉంది. అందుకే ఆ మీడియాకు యెల్లో మీడియా అని పేరు పెట్టి మరీ వైసీపీ నేతలు ఫైర్ అవుతూ ఉంటారు. ఆఖరికి సి‌ఎం జగన్ సైతం ఆ మీడియా చేసే కుట్రలు ఏంటో పబ్లిక్‌గా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.

Sharmila
Sharmila

మరి అలాంటి మీడియాకు సి‌ఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల వెళ్ళడం పట్ల వైసీపీ శ్రేణులు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాయి. జగన్‌పై నిరంతరం వ్యతిరేకంగా కథనాలు వేసే ఓ యెల్లో మీడియా అధినేత..షర్మిలని ఇంటర్వ్యూ చేయనున్నారని తెలిసి వైసీపీ శ్రేణులు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం…అందులో వేసే కొన్ని ప్రశ్నలకు షర్మిల దగ్గర నుంచి ఊహించని సమాధానాలు రావడం జరిగాయి.

అయితే ప్రోమో కాబట్టి ఇంటర్వ్యూ చూసేవరకు ఏది క్లారిటీ రాదు. కానీ ఆ యెల్లో మీడియా ఇంటర్వ్యూకు షర్మిల వెళ్ళడం పట్ల వైసీపీ శ్రేణులు చాలా ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది. జగన్-షర్మిల మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఆమె ఏపీలో వైసీపీ కోసం చాలానే చేశారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య తెలంగాణలో కొత్తగా పార్టీ పెట్టి అక్కడ రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

అక్కడ కే‌సి‌ఆర్ ప్రభుత్వం టార్గెట్‌గా షర్మిల రాజకీయం చేస్తున్నారు. అలాగా తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని పలుమార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. తనతో విభేదాలు వచ్చి పార్టీ పెట్టలేదని, తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకురావాలని పార్టీ పెట్టానని చెప్పారు. సరే ఏదొకటి అక్కడ షర్మిలమ్మ రాజకీయం చేస్తున్నారులే అనుకునేలోపు యెల్లో మీడియాలో కనిపించి వైసీపీ శ్రేణులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఏదేమైనా షర్మిలమ్మ ఆ మీడియాకు వెళ్లకుండా ఉండాల్సిందని వైసీపీ శ్రేణులు అనుకుంటున్నాయి.