వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు : తెలంగాణ మంత్రులకు షర్మిల శిబిరం కౌంటర్‌

తెలంగాణ మంత్రులకు షర్మిల పార్టీ నాయలు కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్ఆర్ ని దొంగ అంటూ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని షర్మిల పార్టీ అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మంత్రులకు సిగ్గుపడాలని… 2004లో వైఎస్ఆర్ తో పెట్టుకునేటప్పుడు సోయి లేదా? అని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాదు మీరే గజదొంగలు అని తెలంగాణ మంత్రులపై ఫైర్‌ అయ్యారు. ఎంతోమంది పేదలకు సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు.

మంత్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలని.. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. షర్మిల పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే వైఎస్ఆర్ పై బురద జల్లుతున్నారని.. ప్రశాంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని డ్రామాలు ఆడిన జులై 8న పార్టీ ప్రకటన ఉంటుందని…. ప్రజల్లో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని చంపలేరని స్పష్టం చేశారు.