అందరినీ టార్గెట్ చేసిన షర్మిల…సక్సెస్ అవుతారా?

-

దివంగత వైఎస్సార్ తనయురాలు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ( YS Sharmila ) తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకోస్తానని చెప్పి, పార్టీ కూడా పెట్టారు. అది కూడా వైఎస్సార్ తెలంగాణ పేరిట పార్టీ పెట్టి, రాజకీయం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి, తెలంగాణలో ప్రధానంగా ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలని లక్ష్యంగా చేసుకుని ఆమె విమర్శలు చేశారు.

వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila
వైఎస్ ష‌ర్మిల‌ | Ys Sharmila

ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు చేస్తూ వచ్చారు. ఏడేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగలేదని విమర్శించారు. నిరుద్యోగులకు, రైతులకు కేసీఆర్ అన్యాయం చేశారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫెయిల్‌ అయ్యారని, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం అపాయింట్‌మెంట్‌ కోసం బిచ్చమెత్తుకుంటున్నారని, కాంగ్రెస్‌, బీజేపీలు పూర్తిగా కేసీఆర్‌కు అమ్ముడుపోయాయని మాట్లాడారు. తామే అసలైన ప్రతిపక్షమని చెబుతున్నారు. ఇక కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డిపై కూడా షర్మిల విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషి అని, చంద్రబాబు చెప్పినట్లుగానే రేవంత్ నడుచుకుంటారనే విధంగా  షర్మిల కామెంట్లు చేశారు. అయితే ఆర్గనైజేషన్స్, ఎన్‌జి‌ఓల గురించి తాను మాట్లాడనని రేవంత్, షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

అయితే ఇలా షర్మిల మూడు పార్టీలని టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారని అర్ధమవుతుంది. తెలంగాణలో రాజకీయం ఎదగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అందుకే చాలా కాన్ఫిడెంట్‌గా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలపై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విధంగా రాజకీయం చేస్తున్న షర్మిల రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. వీరి మధ్య షర్మిలకు తెలంగాణలో అవకాశం దక్కడం చాలా కష్టమే.

Read more RELATED
Recommended to you

Latest news