మెద‌క్‌లో ష‌ర్మిల ప‌ర్య‌ట‌న‌.. నిరుద్యోగ యువ‌తే టార్గెట్‌

తెలంగాణ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌పై ఘాటువిమ‌ర్శ‌లు చేస్తున్నారు ష‌ర్మిల‌. ముఖ్యంగా నిరుద్యోగ‌లు స‌మ‌స్య‌ల‌ను బేస్ చేసుకుని విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ పెట్టి, ఆ త‌ర్వాత నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష‌.. ఇలా వ‌రుస‌గా హంగామా చేశారు. కానీ క‌రోనా కార‌ణంగా పెద్ద‌గా బ‌య‌ట తిర‌గ‌ట్లేదు. కానీ ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్బంగా మెద‌క్‌లో ప‌ర్య‌టించారు.

 

ముందుగా గ‌న్‌పార్కు వ‌ద్ద నివాళి అర్పించి అనంత‌రం మెద‌క్ బ‌య‌లు దేరారు.ఉమ్మ‌డి మెద‌క్‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల‌ను ఓదార్చారు. ఈ సంద‌ర్బంగా ఆమె కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

తెలంగాణలోని నిరుద్యోగుల‌కు చావే దిక్కు అనేలా కేసీఆర్ పాల‌న ఉంద‌న్నారు. 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నార‌ని, నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నార‌ని చెప్పారు. అయితే ఆమె రాజ‌కీయాల‌ను బాగానే వాడుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆవిర్భావంలో మెయిన్ పాయింట్ అయిన ఉద్యోగాల డిమాండ్‌ను ఎత్తుకుని నిరుద్యోగ యువ‌త‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.