సర్వే : టీఆర్‌ఎస్‌ పాలన.. మొదటి ఏడాది ఎలా ఉందంటే..?

-

తెలంగాణ ఏర్పడ్డాక 2014లో కొత్త రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. తన పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ఊహించని విజయంతో గెలుపొంది మళ్లీ తెలంగాణ గద్దెనెక్కారు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, ఏడాది గడిచింది. అయితే సీఎం కేసీఆర్… ఏడాది పాలనలో ప్రజలను ఎంతవరకు ఆకట్టుకున్నారనే దానిపై ఓ తెలుగు దినపత్రిక సర్వే వివరాలు వెల్లడించింది. ఆ సర్వేలో టీఆర్ఎస్ అందరికంటే ముందున్నప్పటికీ.. టీఆర్ఎస్ పాపులారిటీ మాత్రం క్రమంగా తగ్గుతున్నట్టు స్ప‌ష్టమైంది.

ఆ సర్వే ప్రకారం టీఆర్ఎస్ ఓటు శాతం 39.5గా నమోదైంది. కాంగ్రెస్ 26.2 శాతం, బీజేపీ 25.6 శాతం, ఎంఐఎం 2.4 శాతం, ఇతర పార్టీలు 1.6 శాతంగా నమోదైంది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 46.9 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్.. నాలుగు నెలలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లకు పరిమితమైంది. ఇప్పుడు ఆ శాతం మరింత పడిపోయింది సర్వే అంచనా వేసింది. మ‌రోవైపు.. ఈ సర్వేలో వాస్తవం పెద్దగా లేదని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సర్వే ఫలితాలు వెలువరించిన పత్రిక అధినేత బీజేపీ నేత కావడమే ఇందుకు కారణమని వాళ్లు వాదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news