ప్రభుత్వానికి షాక్… హైకోర్ట్ లో మూడు రాజధానులపై పిటీషన్

-

ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు అమరావతి రైతులు న్యాయపోరాటం చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ నేపధ్యంలోనే అమరావతి రైతు పరిరక్షణ సమితి హైకోర్ట్ కి వెళ్ళింది. 3 రాజధానుల గెజిట్ నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

గెజిట్ ప్రకటనను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటన చేయాలని పిటీషనర్… తన పిటీషన్ లో కోరారు. వీటి అమలు పై స్టే ఇవ్వాలని హైకోర్ట్ ని విజ్ఞప్తి చేసారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, విభాగధిపతులు కార్యాలయాలు… సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్ట్ కి దాఖలు చేసిన పిటీషన్ లో కోరారు. అదే విధంగా జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని పిటీషనర్ కోరారు. దీనిపై రేపు హైకోర్ట్ విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news