టీడీపీ పట్టుగొమ్మ‌ను విరిచేసిన జ‌గ‌న్‌… ఎన్టీఆర్ పేరెత్తే అర్హ‌త కూడా బాబుకు లేకుండా చేశారే…!

-

ఏపీలో విప‌క్ష టీడీపీకి గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇంకా చెప్పాలంటే పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఎంతో ప‌ట్టుగొమ్మ‌లుగా ఉండే ఓ అంశంపై సీఎం జ‌గ‌న్ తిరుగులేని దెబ్బ కొడుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న‌కు పేరు తెచ్చిన వాటిల్లో మండ‌ల వ్య‌వ‌స్థ ఒక‌టి. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తాలూకాల స్థానంలో మండ‌ల వ్య‌వ‌స్థ రావ‌డంతో ప్ర‌జులు ఎక్క‌డో సుదూరంలో ఉండే తాలూకాల‌కు చిన్న చిన్న ప‌నుల‌కు కూడా వెళ్ల‌డం త‌గ్గిపోయింది. నాడు ఎన్టీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన మండ‌ల వ్య‌వ‌స్థ‌ను నాటి ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్ల‌స్ అయ్యాయి. మండ‌లం కేంద్రం త‌మ‌కు ద‌గ్గ‌ర‌లోనే ఉండేది.

ఇక తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ సైతం ఆయ‌న అయ్యాక మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్ల‌తో పాటు ఏకంగా జిల్లాల‌ను కూడా విభ‌జించి పాల‌న‌ను మ‌రింత ద‌గ్గ‌ర‌కు తీసుకువ‌చ్చారు. ఇప్పుడు ఏపీలోం సీఎం జ‌గ‌న్ సైతం తాను అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక జిల్లా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు జిల్లాల విభ‌జ‌న‌పై ఏపీలో క‌స‌ర‌త్తులు మొద‌లు అయ్యాయి. క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ పాటికే ఏపీలో జిల్లాల విభ‌జ‌న చాలా వ‌ర‌కు ఓ కొలిక్కి వ‌చ్చి ఉండేది. ఇప్పుడు జ‌గ‌న్ జిల్లాల విభ‌జ‌న‌కు ముందుగానే రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల‌ను కూడా విభ‌జించి.. వీటి సంఖ్య పెంచాల‌ని చూస్తున్నార‌ట‌.

ప్ర‌స్తుతం ఏపీలో ఉన్న 51 రెవెన్యూ డివిజ‌న్ల‌కు తోడు కొత్త‌గా మ‌రో 22 రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాటు చేయ‌నున్నారు. అదే స‌మ‌యంలో డివిజ‌న్ల‌ను విభ‌జించ‌డానికి ముందు మ‌రిన్ని కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేయాల‌ని చూస్తున్నారు. ఎక్కువ జ‌నాభాతో పాటు విస్తీర్ణంలో పెద్ద‌విగా ఉన్న మండ‌లాల‌ను విభ‌జించాల‌ని చూస్తున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మండ‌ల వ్య‌వ‌స్థ త‌మ‌దే అని గొప్పులు చెప్పుకునే టీడీపీకి అది కూడా మిగ‌ల‌దు. నాడు ఎన్టీఆర్ మండ‌ల వ్య‌వ‌స్థ తీసుకువ‌చ్చినా చంద్ర‌బాబు ప‌దే ప‌దే అది త‌మ గొప్ప‌గా చెప్పుకునే వారు.

ఇక జ‌గ‌న్ ఇప్పుడు జిల్లాలు, డివిజ‌న్లు, మండ‌లాలు కూడా విభ‌జిస్తే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చ‌రిత్ర త‌మ ఖాతాలో వేసుకున్న టీడీపీకి అది కూడా చెప్పుకునే ఛాన్స్ ఉండ‌దు. ఇప్పుడు జ‌గ‌న్ ఈ స‌మూల మార్పుల‌తో టీడీపీ చ‌రిత్ర‌ను చెరిపేసి త‌న ఖాతాలో స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించుకోనున్నారు. ఇక బాబు ప‌దే ప‌దే ఎన్టీఆర్ మండ‌ల వ్య‌వ‌స్థ తెచ్చార‌ని.. ఎన్టీఆర్ పేరు ఎత్తే ఛాన్స్ లేకుండా జ‌గ‌న్ దెబ్బ‌కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news