రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాలనా పరంగా జగన్ ముందుకు వెళ్తున్నా.. అధికారికంగా మాత్రం.. ప్రబుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదానికి దారి తీస్తు న్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో ప్రభుత్వం కోర్టులో నిలబడాల్సి వచ్చింది. అదేవిధంగా పలు నిర్ణయా లను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. తాజాగా సోమవారం రెండు కీలక విషయాల్లో అటు సు ప్రీం, ఇటు హైకోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టాయి.
పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని ఇటీవల హైకోర్టు తప్పుపట్టింది. అయితే, ఇదే విషయంపై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, అక్కడ కూడా ప్రభుత్వం ఇ బ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. ఇక, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయానికి సంబంధించి కూడా హైకోర్టు భారీ ఇబ్బందికర పరిస్థితిని కల్పించినట్టయింది. పేదలకు ఇచ్చే ఇళ్లు కట్టుకోవాలనే ఆదేశాలు లేకుండా అమ్ము కోవడం అనే క్లాజ్‌ను చేర్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఈ పరిణామాలతో రెండు కేసుల్లోనూ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితి ని ఎదుర్కొన్నట్టయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలి? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. రెండింటిలో ఒకటి కార్యా లయా లు రంగులు వేయడాన్ని సుప్రీం కోర్టు కూడా తప్పుపట్టిన నేపథ్యంలో విధిగా ఆయా కార్యాలయా లకు రంగులు మార్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పెద్దగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పరిణామం కాకపోయినా.. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం వారికి అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా పోతే.. ఇబ్బందేననే ఆలోచన వస్తోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం జీవో లను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తారో చూడాలి.