రేవంత్ రెడ్డి కి కల్లో కూడా ఊహించని వెన్నుపోటు ?

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరా తో చిత్రీకరించడంతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇది పెద్ద కేసు కాదేమో అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అనుకున్నారు. ఇదే తరుణంలో సింపుల్ గా కూడా బెయిల్ దొరుకుతుందని భావించారు. అయితే ఈ కేసులో దాదాపు గతంలో ఆరుగురు ఈ విధంగానే జైలుకి వెళ్లిన సందర్భంలో వాళ్లకి బెయిల్ దొరకగా, రేవంత్ రెడ్డికి మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి పరిస్థితి కష్టాల్లో చిక్కుకున్నట్లు అయ్యింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. Image result for revanth reddy arrestఇటువంటి క్లిష్ట సమయంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుండి సరైన సపోర్ట్ రావడం లేదు. చాలా వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారాన్ని తప్పుపడుతు ఆ కేసు ఆయన వ్యక్తిగతమని మీడియా ముందు కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క దేనికోసం అయితే అనగా జీవో 111 పై రేవంత్ పోరాటం అంటున్నారో వాటి వల్ల ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజాగా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే, రేవంత్ పోరాడుతున్న జీవో 111 పరిధిలో కాంగ్రెసోళ్ల ఫామ్ హౌజులే ఎక్కువగా ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ నాయకులే.

 

దీనిపై మరీ ఎక్కువ చేస్తే పార్టీకే నష్టమని సలహా ఇస్తున్నారు. పార్టీలో వీహెచ్, జగ్గారెడ్డి వంటి నేతలు. దీంతో ఈ కేసులో రేవంత్ రెడ్డిని ఏకాకి చేయాలని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇదే జరిగితే కనుక రేవంత్ రెడ్డికి కల్లో కూడా ఊహించని కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద వెన్నుపోటు పొడిచి నట్లు అవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Latest news