‘కారు’లోనే తుమ్మల.. కానీ డౌటే..?

-

తెలంగాణలో పార్టీల జంపింగుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్రంలో బలపడి పాగా వేయాలని చూస్తున్న బీజేపీ..టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో ఉన్న బడా నేతలని టార్గెట్ చేస్తుంది..వారిని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు చేస్తుంది. మునుగోడు ఉపఎన్నికలో ఓటమితో కాస్త ఈ వలసలు ఆగాయి గాని..రానున్న రోజుల్లో వలసలు ఊపు అందుకుంటున్నాయని తెలుస్తోంది. మునుగోడులో ఓడిన సరే..బీజేపీ గట్టిగా పోరాడిందనే భావిస్తున్నారు..అలాగే టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయం అని మునుగోడు ఉపఎన్నికతో తేలిపోయింది.

అయితే బీజేపీ బలపడుతుంది గాని..ఆ పార్టీకి రాష్ట్ర స్థాయిలో పూర్తి బలం లేదు..అందుకే ఇతర పార్టీల్లో ఉండే బలమైన నేతలకు వల వేస్తుంది. ఇదే క్రమంలో ఏ మాత్రం బలం లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఎప్పటినుంచో ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలని లాగడానికి చూస్తున్నారు. ఇదే క్రమంలో సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై బీజేపీ ఫోకస్ పెట్టిందని సమాచారం. అయితే తుమ్మల టీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని, ఆయన పార్టీ వీడిపోతారని ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి ఇవ్వలేదని, అలాగే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కన్ఫామ్ చేయడం లేదనే అసంతృప్తి ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా తుమ్మల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో మీ వెంటే ఉంటామని, మళ్ళీ గెలిపించుకుంటామని అనుచరులు, నేతలు, కార్యకర్తలు భరోసా నిచ్చారు. మీరు అండగా ఉంటే కొండలనైనా పిండి చేస్తా అని తుమ్మల ఉద్ఘాటించారు. నాడు ఎన్టీఆర్‌, చంద్రబాబు పాలనలో మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను అభివృద్ధిలో నెంబర్‌ ఒన్‌గా ఉంచానని, ఇదే అభివృద్ధి కోసం ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తున్నానన్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రలోభాలు పెట్టే వారికి అవకాశం ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. అంటే తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాననే హింట్ ఇచ్చారు.

అయితే టీఆర్ఎస్‌లోనే ఉంటానని అంటున్నారు గాని..పూర్తి స్థాయిలో క్లారిటీ రావడం లేదు..నెక్స్ట్ ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకపోతే పరిస్తితి ఏంటి అనేది చూడాలి. మరి భవిష్యత్‌లో తుమ్మల రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news