టీడీపీ నేతలకు సోషల్ మీడియా క్లాసులు…?? పాపం బాబు

-

సోషల్ మీడియా అనేది రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో కొంతమంది సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో చాలా వరకు కూడా యాక్టివ్గా ఉండాలి. చంద్రబాబునాయుడు నుంచి నారా లోకేష్ అలాగే కొంతమంది క్షేత్ర స్థాయి నేతలు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో చాలా మంది నేతలు సైలెంట్ గా ఉండటంఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్న సమయంలో కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేయడానికి కూడా చాలామంది ముందుకు రావడం లేదు. అమరావతి విషయంలో అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా చాలామంది సైలెంట్ గా ఉన్నారు.

అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో కూడా చాలామంది నేతలు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీని వలన తెలుగుదేశం పార్టీ ఏం చెప్పాలి అనుకుంటుందో ముఖ్యంగా యువతలోకి వెళ్లడం లేదు అనే ఆవేదన చంద్రబాబునాయుడు లో ఎక్కువగా ఉంది. దీనితో తెలుగుదేశం పార్టీ నేతలు అందరికి కూడా సోషల్ మీడియా క్లాసులు నిర్వహించే ఆలోచనలో ఆయన ఉన్నారట. దీనికి సంబంధించి ఉగాది రోజున ఆయన శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news