అయ్య‌య్యో ! వ‌ద్ద‌మ్మా ! సోష‌ల్ మీడియా పై కోపం వ‌ద్ద‌మ్మా !

మీడియాను న‌మ్మొచ్చా
సోష‌ల్ మీడియాను న‌మ్మొచ్చా
ఎన్నిక‌ల్లో సోష‌ల్ మీడియా ప్ర‌భావాన్ని
త‌ద‌నంత‌ర ప‌రిణామాల క్ర‌మాన్ని
చూస్తే చాలా వ‌ర‌కూ ఒపినియ‌న్ ఛేంజ‌ర్స్ గానే
సోష‌ల్ మీడియా అకౌంట్లు ఉంటున్నాయి
సంబంధిత ప్లాట్ ఫాంలు ప‌ని చేస్తున్నాయి
ఈ క్ర‌మంలో సోనియా ఎందుక‌ని అస‌హ‌నం చెందుతున్నారు?

 

ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా అనేది పవర్ ఫుల్ వెపన్.ఇంతకుముందు పేపర్లు, టీవీలపై జనాలు ఎక్కువగా ఆధారపడే వాళ్లు అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారింది అరచేతిలోనే అంతా సమాచారం తెలుస్తోంది.ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా పలు సోషల్ మీడియా మాధ్యమాలు ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్నాయి.చివరకు రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం మోతాదు మించి ఉంది.

 

ఇటీవల దీనిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సోషల్ మీడియాలపై ధ్వజమెత్తారు.ప్రజాస్వామ్యాన్ని సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందని ఆమె అన్నారు. సోషల్ మీడియా కావాలనే కొన్ని పార్టీలపై దురుద్ధేశంతో వాడుకుంటున్నాయని విమర్శించారు. ముఖ్యంగా అధికార పార్టీలకు సోషల్ మీడియాలు కొమ్ము కాస్తున్నాయంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేస్తున్నాయని విమర్శించారు. రాజకీయ వ్యక్తులు తమ ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చేస్తున్నాయని సోనియా అన్నారు. గతంలో అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూసే సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ ఇప్పుడు అధికార పార్టీకే ఎక్కువగా మద్దతు పలుకున్నాయని…ఇది సరైన పద్ధతి కాదంటూ పార్లమెంట్ లో ప్రసంగించారు.

నిజానికి సోనియా వ్యాఖ్యలు చూస్తుంటే…పరోక్షంగా బీజేపీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా సోషల్ మీడియా వాడకంలో బీజేపీని మంచినవారు లేరు. ఈ నేప‌థ్యాన ప్రస్తుతం అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగ్ లు ఉన్నాయి. కేవలం సోషల్ మీడియానే ప్రజల అభిప్రాయాలను మారుస్తున్నాయనేది అసంబద్ధ విషయం. సోషల్ మీడియా వల్లే పార్టీలు గెలుస్తాయనేది పూర్తిగా నమ్మలేనటువంటి విషయం.భారతదేశంలో చాలా మంది ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగానే ఉంటున్నారు.2020 లెక్కల ప్రకారం ఇండియాలో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య 37.6 కోట్లు ఉంటే ఇది 2023లో 44.8 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 120 కోట్లకు పైగా ఉండే భారత దేశంలో సోషల్ మీడియా ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పలేం. చాలా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజల అవసరాలు, అవకాశాలు,ఆశలు,ఆశయాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి.కేవలం సోషల్ మీడియాలో ఉదరగొడితే… ఓట్లు రాలవనేది సత్యం.