FLASH : కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్ళీ సోనియా..!

-

వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పార్టీ అధ్యక్ష పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై ఏడు గంటలపై చర్చించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏమీ తేల్చలేకపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీనే మరికొంతకాలం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తికి సారధ్య బాధ్యతలు కట్టబెట్టాలని సోనియా కుటుంబం భావించగా, అందుకు నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం, సోనియానే కొనసాగాలని నేతలు ఒత్తిడి చేయడంతో ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

మరో ఆరు నెలల్లో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లేఖ రాసిన నేతలంతా బీజేపీతో కుమ్మక్కయ్యారా అని రాహుల్ వ్యాఖ్యానించినట్టు వార్తలు కూడా వచ్చాయి. కాగా, దీన్ని రాహుల్ సహా పార్టీ నేతలూ ఖండించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news