సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా అంటూ ఫైర్ అయిన స్పీక‌ర్ త‌మ్మినేని.. ఎవ‌రిపై అంటే..?

-

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా జరుగుతున్నాయి. అయితే ఏపీలో రాజధాని అమరావతి తరలింపు ఖాయమైన నేపథ్యంలో సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌కు అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. దీంతో ఆగ్రహించిన స్పీకర్‌.. ‘సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఉందా’ అంటూ అచ్చెన్నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు హద్దులు దాటుతున్నారని స్పీకర్ కోపగించుకున్నారు.

మ‌రోవైపు అమరావతిలో భూకుంభకోణాలపై ఖచ్చితంగా విచారణ జరపాలని సీఎంకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ జరపాలని కోరే హక్కు మీకు ఎవరిచ్చారని స్పీకర్‌ను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. దీనికి స‌మాధానంగా.. విచారణ అంటే మీరెందుకు ఉలికి పడుతున్నారంటూ టీడీపీనేతలకు చురకలంటించారు స్పీకర్. ఏ తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం అంటూ తమ్మినేని ప్రశ్నించారు. దీంతో స్పందించిన సీఎం జగన్ ఖచ్చితంగా మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. స్పీకర్‌కు ఆ అధికారులు ఇచ్చే హక్కు ఉందన్నారు జగన్.

Read more RELATED
Recommended to you

Latest news