ఏపీ రాజకీయాల్లో ఎన్ని పార్టీలు మార్చిన, ఎన్నిసార్లు నియోజకవర్గాలు మార్చిన ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు మాత్రమే. ఈయన ఎప్పటి వరకు ఎన్ని సార్లు పార్టీ మార్చారు…ఎన్ని సార్లు నియోజకవర్గాలు మార్చారో అందరికీ తెలిసిందే. 1999 ఎన్నికల్లో టీడీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే, 2014లో టీడీపీ నుంచి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయకుండా గంటా విజయం సాధించారు.
అయితే 2019 తర్వాత టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో గంటా సైలెంట్ అయిన విషయం తెలిసిందే. అలాగే ఆయన వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన పార్టీ మారలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన సరికొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నారని తెలుస్తోంది. ఎలాగో వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ పొత్తు సెట్ అవ్వడానికి గంటా తనవంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఎందుకంటే జనసేన సపోర్ట్ ఉంటే టీడీపీ గెలుపు ఈజీ అవుతుంది.
అదే సమయంలో గంటా నెక్స్ట్ భీమిలిలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట. అక్కడ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పైగా ఇక్కడ జనసేనకు ఓట్లు బాగానే ఉన్నాయి. దీంతో ఇక్కడ పోటీ చేయడానికి గంటా రెడీ అవుతున్నారట.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…ఒకవేళ పొత్తులో భాగంగా భీమిలి సీటు గానీ జనసేనకు కేటాయిస్తే గంటా…అదే పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. అందుకే ఆయన రెండు ఆప్షన్లు పెట్టుకుని ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ లేదా జనసేన…ఈ రెండు పార్టీల్లో ఏదొక పార్టీలో గంటా పోటీ చేసి మళ్ళీ సేఫ్ సైడ్ గా గెలిచి బయట పడాలని భావిస్తున్నారట. మరి చూడాలి ఈసారి గంటా స్ట్రాటజీలు ఏ మాత్రం వర్కౌట్ అవుతాయో.