బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు జరుపుతున్న కొద్దీ కొత్త నిజాలు బైటపడుతున్నాయి. అఖిలప్రియ కస్టడీ ముగిశాక..పోలీసులు మరికొందరు కొత్త వ్యక్తులపై దృష్టి సారించారు . అఖిలప్రియకు భర్త ఒక్కడే సహకరించాడని మొదట అనుకున్నా..ఆమె కుటుంబంతో పాటు భర్త ఫ్యామిలీ కూడా కిడ్నాప్‌కు సహకరించారని పోలీసులు ఆదారాలు సేకరించారు. మాజీ మంత్రి అఖిలప్రియ ఊబిలో ఇరుక్కున్నారా పైకి చెబుతున్నట్టుగా ల్యాండ్ సెటిల్మెంట్.. కిడ్నాప్‌లే కాకుండా ఇతరత్రా పాత గొడవలు ఈ కేసులో ఉన్నట్లు తెలుస్తుంది.
హఫీజ్‌పేట భూవ్యవహారంలో బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ పెద్ద దుమారమే లేపుతోంది . పోలీసుల దర్యాప్తు ముందుకువెలుతున్న కొద్దీ..కొత్త కొత్త నిజాలు తెలుస్తున్నాయి . ఈ కిడ్నాప్‌కు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆమె భర్త బార్గవ్‌రామ్‌లు కిడ్నాపర్లతో నేరుగా మాట్లాడినట్టు మొదట ఆదారాలు సేకరించిన పోలీసులు..అఖిల ప్రియ కస్టడీ లో మరిన్ని నిజాలు రాబట్టారు . కస్టడీలో అఖిలప్రియ పోలీసులకు ఏమాత్రం సహకరించపోయినా ఆమె నోటి నుంచి మరిన్ని కొత్త పేర్లు చెప్పించారు.
తమకే సంబందం లేదనీ తాము దుబాయ్‌నుంచి వచ్చామని చెప్పిన బార్గవ్ రామ్ పేరంట్స్ పాత్రనూ పోలీసులు వదల్లేదు . క్రిష్ణానగర్‌లోని ఎంజీఎం స్కూల్‌లోనే..కిడ్నాపర్లు వాడిన కార్లకు నెంబర్ ప్లేట్స్ మార్చారు..ఈ స్కూల్‌లోనే ..ఐటీ అదికారుల మాదిరిగా డ్రెస్సులు వేసుకున్నారు..ఇక్కడి సీసీ కెమరాల్లో ఈ తతంగం అంతా రికార్డయిందని పోలీసులు చెబుతున్నారు . ఈ కిడ్నాప్ గురించి బార్గవ్‌రామ్ పేరంట్స్ కు కూడా ముందే తెలుసంటున్న పోలీసులు..భార్గవ్‌రామ్ తల్లి పాత్రపై స్పెషల్ టీమ్ ఆరా తీస్తోంది . అంటే..ఇప్పటికే అఖిలప్రియ ఫ్యామిలీ దాదాపుగా ఈ కేసులో ఇరుక్కుంది..ఇప్పుడు భార్గవ్‌రామ్ ఫ్యామిలీకి కూడాకిడ్నాప్ కేసుతో సంబందం ఉందని తేలితే రెండు ఫ్యామిలీలు ఈ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది.
ఈ కేసు ఒకేసారి మొత్తానికి మొత్తం అఖిలప్రియకు ఎందుకు చుట్టుకుంది ఆమె మాజీ మంత్రి. ఏపీలో విపక్ష పార్టీకి చెందిన నేత. రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిణామాల వల్ల ఆమె ఊబిలో ఇరుక్కుపోయారా? కిడ్నాప్ కేసులో పోలీసులు చెప్పే పక్కా ఆధారాలు.. రుజువులు.. పాత గొడవల సంగతి పక్కన పెడితే ఈ కేసులో ఇంకేమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అన్నది ఆసక్తి రేపుతుంది. భూమా నాగిరెడ్డి, శోభ దంపతులు బతికున్న సమయంలోనే అఖిలప్రియకు పెళ్లి అయింది. విడాకులు తీసుకున్నారు. అఖిలప్రియ భార్గవరామ్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అతనికి కూడా ఇది రెండో వివాహమే. ఓ పోలీస్ ఆఫీసర్ కుమార్తెను పెళ్లి చేసుకుని డైవోర్స్ ఇచ్చారు భార్గవరామ్. ఆ తర్వాతే అఖిలప్రియతో భార్గవ్‌రామ్ పెళ్లి అయింది.
ఈ కిడ్నాప్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత భార్గవ్‌రామ్ గత సంబంధాలు.. ముందు జీవితం ఇప్పుడు వెంటాడుతుంది. భార్గవ్ గత జీవితానికి ఏదైనా సంబంధం ఉందా అన్నది ఇప్పుడు ఆసక్తిరేపుతుంది. ఈ సందర్భంగానే అఖిలప్రియ రాజకీయ, వ్యక్తిగత జీవితం.. భార్గవ్ రామ్ గత సంబంధాలను కొందరు టచ్ చేస్తున్నారు. ఏ3గా ఉన్న భార్గవ్‌రామ్ చిక్కితే కేసు మరో మలుపు తీసుకోవడం ఖాయం. భూమకుటుంబాన్ని ఈ ల్యాండ్ వివాదంలో ఉసిగొల్పింది భార్గవ్ రామ్ ఫ్యామిలీనే అన్న విషయం పోలీసు విచారణలో ఒకొక్కటిగా బయటికొస్తున్నాయి.