మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత ఎంపిక.. ఎందుకంటే..!?

-

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీతను మరోసారి జగన్‌ ప్రభుత్వం ఎంపిక చేసింది. మరోసారి పోటీలో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పించింది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన 3 నెలల్లోనే మళ్లీ అవకాశం ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్‌ చేస్తూ వైసీపీ అధినేత, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు బీఫామ్‌ని కూడా అందజేశారు. దీంతో పోతుల సునీత ఒక సెట్‌ నామినేషన్‌ను సోమవారం దాఖలు చేశారు.

jagan
jagan

ఈ సందర్భంగా పోతుల సునీత మాట్లాడుతూ.. మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేట్‌ చేయడంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశీస్సులతోనే తాను నామినేషన్‌ వేసినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం, అనేక సంక్షేమ పథకాలు అందించడంలో సీఎం జగన్‌ ఎంతో కష్టపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. సీఎం జగన్‌ పాలనను ఓర్వలేని వారు అభివృద్ధిని అడ్డుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. కోర్టులను అడ్డుపెట్టుని ఇళ్ల స్థలాలు ఇవ్వనీయకుండా చేస్తున్నారన్నారు. 20 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగినప్పుడు నరకం చూపించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తోటి నాయకుల ఎదుగుదలను ఓర్వలేకపోయేవాడని, అందుకే టీడీపీని వీడి వైఎస్సార్‌ పార్టీలో చేరానన్నారు. సీఎం జగన్‌ నేను రాజీనామా చేసిన మూడు నెలల్లో తిరిగి ఎమ్మెల్సీ పదవిని కేటాయించడం చొప్పుకోదగ్గ విషయమని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ పార్టీ బలోపేతానికి సాయశక్తుల కృషి చేస్తానన్నారు.

కాగా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మూడు నెలల్లోనే పోతుల సునీతకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంపై వైసీపీలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల చీరాలలో జరిగిన సమావేశంలో కరణం బలరాం 2024లో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి అని ఒకరు వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే చీరాలలో ఎమ్మెల్సే కరుణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌ మధ్య టికెట్‌ కోసం గొడవ పడుతున్నారు. మళ్లీ పోతుల సునీత కూడా టికెట్టు కోసం కొట్లాడితే వర్గ విబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్‌ ఆమెకు ఎమ్మెల్సీ పదవి కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news